2026 T20 World Cup: 2026 T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇండియాలో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడటానికి భద్రతా కారణాలను సాకుగా చూపిన బంగ్లాదేశ్.. ఏకంగా టోర్నీ నుంచే దూరం అయిన సంగతి తెలిసిందే. ఇదే కారణాలను చూపి ఇప్పుడు ICC బంగ్లా స్పోర్ట్స్ జర్నలిస్టులను కూడా టోర్నీ నుంచి నిషేధించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. టోర్నమెంట్‌ను కవర్ చేయడానికి బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు…
T20 World Cup: మహ్మద్ యూనస్ చేసిన రాజకీయంతో బంగ్లాదేశ్ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్(BCB) నిరాకరించింది. భద్రతా కారణాలను చూపుతూ, తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే, ICC మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో బీసీసీ టోర్నీని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది.
Bangladesh vs ICC: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో ఐసీసీతో వివాదాన్ని పెట్టుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు గట్టి షాక్ తగిలింది. బీసీబీ విజ్ఞప్తిని ఇప్పటికే తిరస్కరించిన ఐసీసీ ఆ దేశానికి మరోసారి దిమ్మతిరిగేలా చేసింది.
ICC Ultimatum to Bangladesh: 2026 టీ20 ప్రపంచకప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠినమైన అల్టిమేటం జారీ చేసింది. భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాల్గొనాలా? లేక టోర్నీ నుంచి తప్పుకోవాలా? అనే విషయంపై జనవరి 21 చివరి తేదీగా నిర్ణయిస్తూ ఐసీసీ స్పష్టత ఇచ్చింది. భద్రతా కారణాలను చూపిస్తూ భారతదేశంలో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తుండటంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. భారత్‌కు బదులుగా శ్రీలంకను ప్రత్యామ్నాయ…
Mustafizur Rahman: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు ఫ్రాంచైజ్ క్రికెట్‌లో కొత్త గమ్యం దొరికింది. ఐపీఎల్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న వెంటనే.. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆఫర్ వచ్చింది. ఈ పరిణామం క్రికెట్ వర్గాల్లో, ముఖ్యంగా బోర్డులు, టోర్నమెంట్ నిర్వాహకుల మధ్య పెద్ద చర్చలకు దారి తీసింది. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్ ముస్తాఫిజుర్‌ను జట్టులో నుంచి తొలగించింది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ వేలంలో ఇతర…