Site icon NTV Telugu

Asia Cup 2023: పాకిస్తాన్‌కి బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఆసియా కప్ రద్దు?

Bcci Shock To Pak

Bcci Shock To Pak

BCCI Gives Big Stroke To Pakistan Over Asia Cup 2023: ఆసియా కప్‌-2023 నిర్వహణ అంశం మీద బీసీసీఐ, పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణ హక్కులను పీసీబీ దక్కించుకోవడంతో.. బీసీసీఐ గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాక్‌లో ఈ ఈవెంట్ నిర్వహిస్తే.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా క్రికెటర్లను పాక్‌కు పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ జై షా అప్పట్లో కుండబద్దలు కొట్టారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇరు క్రికెటర్ల మాజీల మధ్య మాటల యుద్ధం సైతం కొనసాగింది.

Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన కోర్టు.. వారిపై చర్యలకు ఆదేశాలు

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ కూడా.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అందుకు పీసీబీ అదే తరహాలో బదులిచ్చింది. దీంతో.. తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఈ ఆసియా కప్ టోర్నీ సజావుగా సాగాలంటే.. భారత్‌కు చెందిన మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను ఇతర వేదికలపై నిర్వహించేందుకు వీలుగా ఒక హైబ్రీడ్ మోడల్‌ని రూపొందించగా, అందుకు పీసీబీ సానుకూలంగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే.. ఈ కథలో ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగుచూసింది. హైబ్రీడ్‌ మోడల్‌ ప్రతిపాదనకు మొదట సానుకూలత తెలిపిన బీసీసీఐ.. ఇప్పుడు దాన్ని తిరస్కరించిందని సమాచారం. ఈ ఆసియా కప్ టోర్నీ వేదికను పాక్‌ నుంచి వేరే దేశానికి తరలించాలని బీసీసీఐ పట్టుబట్టినట్లు తెలిసింది.

Yashaswi Jaiswal: చరిత్ర సృష్టించిన యశస్వీ.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు

దీంతో.. ఆసియా నిర్వహించేందుకు శ్రీలంక, యూఏఈ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. కానీ.. పాకిస్తాన్ మాత్రం తమ దేశంలోనే ఈ టోర్నీ నిర్వహించాలని పట్టుబడుతోంది. ఒకవేళ ఈ సమస్య ఇప్పుడు పరిష్కారం కాకపోతే.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించినట్టు తెలిసింది. అలాంటప్పుడు బీసీసీఐ ఊరికే ఉంటుందా? పాక్‌కు దిమ్మతిరిగేలా ఒక మాస్టర్ స్కెచ్ వేసింది. ఆసియా కప్‌ ఈవెంట్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఐదు దేశాలు మాత్రమే పాల్గొనేలా మరో టోర్నీ నిర్వహణకు వీలుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కాగా పాక్‌లో ఆసియా కప్‌ నిర్వహించే విషయంపై తాము ఇతర దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని జై షా తెలిపిన విషయమూ విదితమే!

Exit mobile version