NTV Telugu Site icon

India Vs New Zealand: ఆకాశంలో విమానం.. లైవ్ స్కోర్ అప్డేట్స్ అందించిన ఇండిగో పైలెట్.. ట్వీట్ వైరల్..

Indigo

Indigo

India Vs New Zealand: నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కి మంచి అనుభూతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఓపెనింగ్‌తో పాటు గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఒకెత్తయితే, కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలోతో ఔరా అనిపించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. వన్డేల్లో 50వ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచుని దేశం మొత్తం టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయారు.

ఇదిలా ఉంటే ఆకాశంలో ఉన్న విమానంలో ఏకంగా ఫ్లైట్ కెప్టెన్ క్రికెట్ లైవ్ స్కోర్ అందిస్తూ ప్రయాణికులను ఉత్సాహపరిచారు. ఈ ఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. తమ పైలెట్ ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి లైవ్ స్కోర్ అప్డేట్ చేయడంపై ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. బెంగళూర్‌కి చెందిన కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ నీర్జా షా ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. ‘‘ మా ఇండిగో6ఈ ఫ్లైట్ కెప్టెన్ ల్యాండ్ అయ్యే వరకు ప్రతీ అరగంటకు ఒకసారి వరల్డ్ కప్ మ్యాచ్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ఈ దేశం క్రికెట్‌ని ఎలా ఆరాధిస్తుందో తెలిసింది’’ అంటూ పోస్ట్ చేశారు.

Read Also: Rohit Shama: శ్రేయాస్ని ఇమిటేట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్

కెప్టెన్ ఇలా లైవ్ స్కోర్ అప్డేట్స్ అందించడంపై ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో 2019లో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచు గురించి ఓ నెటిజన్ ముంబై-బెంగళూర్ ఇండిగో విమానంలో ఇలాంటి ఘటననే గుర్తుచేసుకున్నారు.

దీనిపై స్పందించిన ఇండిగో యాజమాన్యం..‘‘మా కెప్టెన్ మీ విమానాన్ని లైవ్ స్టోర్ట్స్ అప్డేట్‌గా మార్చారని వినడానికి మేము సంతోషిస్తున్నాము. ఇండిగోలో మా ప్రయాణికులు ఆకర్షణీయమైన, వినోదాత్మక అనుభవాన్ని అందించాడాన్ని మేం లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

నిన్న జరిగిన మ్యాచులో న్యూజిలాండ్‌పై ఇండియా 70 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అనేక రికార్డులకు ఈ మ్యాచ్ వేదికగా నిలిచింది. క్రికెట్ లెజెండ్ సచిన్‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్‌కి చెందిన పలువురు నటులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఇండియా ఫైనల్స్‌కి చేరుకుంది.