India’s 188-Run Win Over Bangladesh: బంగ్లాదేశ్ లో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ టెస్టుల్లో శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారీ విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, భారత బౌలింగ్ ముందు దాసోహం అయింది. ఐదోరోజు బంగ్లాదేశ్ ను 324 పరుగులకి ఆలౌట్ అయింది. రెండు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది ఇండియా.
Read Also: PM Narendra Modi: త్రిపుర, మేఘాలయాల్లో ప్రధాని సుడిగాలి పర్యటన..
భారత్ తరుపున తొలి ఇన్నింగ్స్ లో ఛతేశ్వర్ పూజారా 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి కుల్దీప్ యాదవ్ మొత్తం 8 వికెట్లు తీశాడు. ఇందులో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ కుల్దీప్ దెబ్బకు 150 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను కోలుకోనిదెబ్బ తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్ 4 వికెట్లు పడగొట్టాడు.
స్కోర్లను పరిశీలిస్తే భారత్ తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 258/2 డిక్లెర్ చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ గట్టి పోరాటమే చేసింది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా బ్యాటర్లు జకీర్ హుసేన్ సెంచరీ చేయగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 84 పరుగులు చేశాడు. అయితే షకీబ్ కు మరో ఎండ్ లో మద్దతు దొరకలేదు. దీంతో బంగ్లాదేశ్, భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.