INDW vs WIW: వెస్టిండీస్ చిత్తు.. సత్తా చాటిన భారత అమ్మాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Women Cricket Team Won Against West Indies In T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌లో మన భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. గ్రూప్-బీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో భారత అమ్మాయిలు ఛేధించారు. షెఫాలీ వర్మ (28), హర్మన్ ప్రీత్ కౌర్ (33), రిచా ఘోష్ (44) రాణించడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ నెగ్గింది. తొలుత వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. బారత్ ఆశలు సన్నగిల్లాయి. కానీ, మన అమ్మాయిలు అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. ఫైనల్‌గా జట్టుని గెలిపించారు.
Pooja Hegde: ఇకనుంచి ఆఫర్లు కావాలంటే.. పూజా ఆ పని చేయాల్సిందే..?
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత కెప్టెన్ హేలీ మాథ్యూస్ వెంటనే ఔట్ అవ్వడంతో.. విండీస్‌కి గట్టి దెబ్బ తగిలినట్టయ్యింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన క్యాంప్‌బెల్(30)తో కలిసి స్టెఫనీ టేలర్ జట్టుని ముందుకు నడిపించింది. వెంటనే మరో వికెట్ పడకుండా వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ.. స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్‌కి ఈ ఇద్దరు 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక చివర్లో చెడియన్ (21), షబికా (15) పర్వాలేదనిపించడంతో.. వెస్టిండీస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్ల విషయానికొస్తే.. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, రేణుక సింగ్ & పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయడంతో, అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది.
Manikrao Thakre: పొత్తులు అనేవి ఉండవు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం
ఇక 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుభారంభమే చేసింది. షెఫాలి, స్మృతి కలిసి తొలి వికెట్‌కి 32 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే.. ఆ వెంటనే రెండు ఝలక్‌కు తగిలాయి. స్మృతి(10) ఔటైనా కాసేపటికీ జెమిమా రోడ్రింగ్స్ (1) పెవిలియన్ చేరింది. దీంతో.. టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. అప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ (33) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని ఆదుకోగా.. రిచా ఘోస్ (44) దుమ్ముదులిపేసి జట్టుని గెలుపు దిశగా పరుగులు పెట్టించింది. బ్యాటింగ్‌లో ఈ ఇద్దరు సమర్థవంతంగా రాణించడం వల్లే.. ఫైనల్లో భారత్ విజయకేతనం ఎగరవేయగలిగింది. ఈ టోర్నీలో భారత్‌కి ఇది రెండో విజయం. ఇదివరకే పాకిస్తాన్‌పై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!