తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తల్లి, అత్త, కూతురు, చెల్లెలు ఇలా అన్ని పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది… ఓవైపు నటిగా ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు జిమ్‌లో వర్కౌట్స్‌తో బాగా పాపులర్ అయింది. అవన్నీ సరదాగా చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ…
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 13 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
కామన్వెల్త్ క్రీడల్లో మంగళవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. భారత అథ్లెట్లు మంగళవారం కామన్వెల్త్ క్రీడల్లో పసిడి మోత మోగించారు. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన అమ్మాయిలు లాన్‌బౌల్స్ ఫోర్స్ విభాగంలో చారిత్రాత్మక విజయంతో తొలి స్వర్ణాన్ని అందించారు.
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో మన దేశానికి మరో గోల్డ్ మెడల్ వచ్చింది. మరోసారి వెయిట్ లిఫ్టింగ్‌లోనే భారత్ పతకం సాధించింది. ఆదివారం పురుషుల 67 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినంగ్ మొత్తం 300 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం గెలిచాడు. స్నాచ్‌లో 140 కిలోలతో అతడు కామన్వెల్త్ రికార్డు సృష్టించాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 160 కిలోలు మొత్తంగా 300 కిలోలతో సంచలనం సృష్టించాడు. అరంగేట్రంలోనే జెరెమీ…
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 61 కేజీల విభాగంలో గురురాజ్ పుజారీ కాంస్యం సాధించాడు. ఈ పోటీల్లో గురురాజ్ పుజారీ 269 కిలోలను ఎత్తి కాంస్యం గెలుచుకున్నాడు. భారత వెయిట్‌లిఫ్టర్ గురురాజ్ తన మొదటి స్నాచ్ ప్రయత్నంలో 114 కేజీలు, రెండోసారి 118 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో గురురాజ్ మూడో ప్రయత్నంలో 151 కిలోల లిఫ్ట్‌తో తన పతకాన్ని ముగించాడు.…
Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సంకేత్ సర్గార్‌కు సిల్వర్ పతకం లభించింది. శనివారం జరిగిన 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రెండో స్థానంలో నిలిచాడు. 55 కిలోల విభాగంలో సంకేత్ 248 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 114 కిలోలు ఎత్తగా.. క్లీన్ అండ్ జర్క్‌లో 135 కిలోలు లిఫ్ట్ చేశాడు. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే…
ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు సత్తా చాటారు. మెక్సికో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆకాంక్ష కిషోర్, విజయ్ ప్రజాపతి రజత పతకాలు కైవసం చేసుకున్నారు. బాలికల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆకాంక్ష.. స్నాచ్‌లో 59 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 68 కేజీలు ఎత్తి.. మొత్తం మీద 127 కేజీలు లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. 49 కేజీల కేటగిరిలో స్నాచ్‌లో 78 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో…