కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటుతున్నారు. ఈ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు స్వర్ణాలు భారత్ తన ఖాతాలో వేసుకోగా.. ఆ మూడు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో వచ్చినవే కావడం గమనార్హం.
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో మన దేశానికి మరో గోల్డ్ మెడల్ వచ్చింది. మరోసారి వెయిట్ లిఫ్టింగ్‌లోనే భారత్ పతకం సాధించింది. ఆదివారం పురుషుల 67 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినంగ్ మొత్తం 300 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం గెలిచాడు. స్నాచ్‌లో 140 కిలోలతో అతడు కామన్వెల్త్ రికార్డు సృష్టి�