NTV Telugu Site icon

Champions Trophy 2025: పాకిస్తాన్‌లో భారత జెండా వివాదం.. కరాచీ స్టేడియం వీడియో వైరల్

Pak

Pak

Champions Trophy 2025: పాకిస్థాన్‌ ఆతిథ్యంలో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ కోసం దాయాది దేశంలో పర్యటించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. అయితే, ట్రోఫీ ఆరంభానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం వివాదానికి తెర లేపింది. ఈ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించగా.. అందులో భారత్ జెండా కనిపించకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ లవర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: US: అమెరికాలో భారీ వర్షాలు.. 9 మంది మృతి

అయితే, భారత్ పతాకం ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కరాచీ స్టేడియం వేదికగా.. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ జట్ల మ్యాచ్‌లు జరగనున్నాయి. కానీ, ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జెండాలు ప్రదర్శించాల్సిన చోట భారతదేశ జెండాను ప్రదర్శించకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

Read Also: KCR Birthday: కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

ఇక, పాకిస్థాన్‌ గడ్డపై ఆడటానికి ఇంట్రెస్ట్ చూపించకలేదు.. దీంతో టీమిండియా ప్లేయర్లతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు హగ్‌ చేసుకోవద్దని తమ క్రికెటర్లను పాక్ క్రికెట్ అభిమానులు ఇటీవల హెచ్చరించారు. కాగా, దాయాది దేశం పాకిస్థాన్‌లో ఆడేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో.. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌కు మార్చారు. ఇక, భారత్‌ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్‌ సెమీస్‌, ఫైనల్‌కు వస్తే.. ఆ మ్యాచ్‌లు కూడా అక్కడే జరగుతాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్థాన్ మధ్య ఈ నెల 23వ తేదీన దుబాయ్ వేదికగా జరగనుంది.