భారత క్రికెట్ జట్టులో కొందరు అద్భుతమైన నాయకులు ఉన్నారు. ఎంఎస్ ధోని నుంచి పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరైన సౌరవ్ గంగూలీని రాబోయే సంవత్సరాల్లో రోహిత్ తరువాత కెప్టెన్ ఎవరంటూ ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో తన అభిప్రాయాలను దాదా వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని నాయకులకు మంచి గ్రూమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా చూస్తున్నానని, రాబోయే సంవత్సరాల్లో హార్థిక్ పాండ్యా హిట్‌మ్యాన్ వారసుడు అవుతాడని సూచించాడు.
Also Read : Srirama Navami Special: రాముడిని హనుమంతుడు బాల్యంలోనే కలిశాడా ?
హార్థిక్ పాండ్యా ఇప్పటికే T20లు, ODIలకు పలు సందర్భాల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడని గంగూలీ వెల్లడించాడు. ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా ఎంత చక్కగా సారథ్యం వహించాడో చూశాం. అతను పొట్టి ఫార్మాట్‌లలో కూడా భారత్‌కు కెప్టెన్‌గా ఉండడానికి ఇది ఒక కారణం అంటూ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్‌లో గెలుపు, ఓటములను మీరు విస్మరించలేరు ఎందుకంటే ఇది. చాలా కఠినమైన టోర్నమెంట్ అని అతను చెప్పాడు. పెద్ద ఈవెంట్లకు (T20 ప్రపంచ కప్ లేదా ODI ప్రపంచ కప్) ముందు సెలెక్టర్లకు IPL రిఫరెన్స్ పాయింట్ గా మారడం గురించి కూడా గంగూలీని అడిగారు. సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్ మొత్తం అందరి ఆట తీరును చూసిన తర్వాతే వారిని సెలక్ట్ చేస్తారని.. ఐపీఎల్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం లేదని సౌరవ్ గంగూలీ చెప్పాడు.
Also Read : Supreme Court on Viveka Case: వివేకా హత్యకేసు విచారణకు కొత్త సిట్
సెలెక్టర్లు ఆటగాళ్ల ప్రదర్శనలను బ్యాలెన్స్ చేస్తారని నేను భావిస్తున్నాను అని సౌరవ్ గుంగూలీ అన్నారు. వారు ఐపీఎల్ పై ఆదరపడి గుడ్డిగా వెళ్లరు… బహుశా టీ20 జట్టును ఎంచుకునే సమయంలో.. ఐపీఎల్ ప్రదర్శనలను పరిశీలించవచ్చు అంటూ బీసీసీఐ మాజీ చీఫ్ వెల్లడించాడు. సెలెక్టర్లు, తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్‌గా, రాహుల్ ఉన్నారు. కోచ్‌గా ద్రావిడ్. వారికి ఏమి కావాలో తెలుసు.. వారికి ఒక ప్లాన్ ఉంది అంటూ పేర్కొన్నాడు. వారు చాలా బ్యాలెన్స్‌డ్ వ్యక్తులు అని నేను భావిస్తున్నాను.. భారత క్రికెట్‌కు ఏది ఉత్తమమో అది చేస్తారని బీసిసిఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు.