శ్రీరామనవమి వచ్చిందంటే చాలు భక్తులు భక్తిపారవశ్యులవుతారు. రామాయణంలో ప్రతిఘట్టం ఎంతో రమ్యంగా ఉంటుంది. శ్రీరాముడిని హనుమంతుడు బాల్యంలోనే కలిశాడంటారు. రావణ వధకు ముందే హనుమంతుడు సుగ్రీవుడు పంపగా శ్రీరాముడిని కలిశాడు. ఒక రహస్య వేషంలో వచ్చిన హనుమంతుడు అసలు నిజం చెప్పేశాడు. హనుమంతుడిని చూడగానే రాముడు పరమానందభరితుడయ్యాడు. రామాయణంలో అన్ని కాండలకంటే సుందరకాండ ముఖ్యమయినది. ప్రతి ఏటా శ్రీరాముడి కల్యాణం చూడాలి. హనుమంతుడిని పూజించాలి. జీవుడు బాగుపడాలంటే భగవంతుడు గురువుతో కలవాలి. హనుమంతుడే గురువు.గురువు కృప కలిగితే మనకు తిరుగుండదు.