Hockey Worldcup: హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hockey Worldcup: హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. పూల్-డిలో భాగంగా శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో భారత్ విజయం సాధించింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ రోహిదాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌ను భారత్ తొలుత నెమ్మదిగా ఆరంభించింది. ఆ తర్వాత ప్రత్యర్థి గోల్‌పోస్టులపై దాడులు చేస్తూ దూకుడు పెంచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను జర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ ఆ తర్వాత దక్కిన మరో పెనాల్టీ కార్నర్‌ను టీమిండియా సద్వినియోగం చేసుకుంది. అమిత్ రోహిదాస్ వేగంగా స్పందించి మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్టులోకి పంపి భారత్ ఖాతా తెరిచాడు.
Read Also: Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?
Also Read
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
- ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
- Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
ఆ తర్వాత హార్దిక్ సింగ్ గోల్‌పోస్టు సమీపంలో బంతిని పాస్ చేశాడు. అది ప్రత్యర్థి ఆటగాడి స్టిక్కు తగిలి గోల్‌పోస్టులోకి వెళ్లడంతో భారత్ ఆధిక్యం 2-0కి పెరిగింది. మూడో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో భారత్ విఫలమైంది. మరోవైపు గోల్స్ కోసం స్పెయిన్ తీవ్రంగా పోరాడినా భారత డిఫెన్స్ ఆటగాళ్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరి 7 నిమిషాల్లో స్పెయిన్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ భారత డిఫెన్స్ ఆటగాళ్లు విజయవంతంగా అడ్డుకోగలిగారు. దీంతో స్పెయిన్ ఖాతా తెరవలేకపోయింది. భువనేశ్వర్‌లో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై ఆస్ట్రేలియా 8-0తో ఘన విజయం సాధించగా రూర్కెలాలో జరిగిన పూల్-డి మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న వేల్స్‌పై 5-0 తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!