India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
- అక్టోబర్ 6న తొలి టీ20
- భారత్-వెస్టిండీస్ 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies T20 Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటికే ముగిసిన వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించగా, మూడో వన్డేలో వెస్టిండీస్ గెలిచింది. ఇప్పుడు ఇరు జట్లు టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది.
అక్టోబర్ 6న తొలి టీ20
భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు అక్టోబర్ 6న తెరలేవనుంది. తొలి టీ20 మ్యాచ్ లక్నో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. ఈ సిరీస్‌లో టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఇప్పుడు అదే జోష్‌తో వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌లో బరిలోకి దిగనుంది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్
తొలి టీ20: అక్టోబర్ 6 – లక్నో
రెండో టీ20: అక్టోబర్ 9 – రాంచీ
మూడో టీ20: అక్టోబర్ 11 – ఇండోర్
నాలుగో టీ20: అక్టోబర్ 14 – హైదరాబాద్
ఐదో టీ20: అక్టోబర్ 17 – బెంగళూరు
అక్టోబర్ 17న జరిగే ఐదో టీ20తో ఈ సిరీస్ ముగియనుంది.
వాషింగ్టన్ సుందర్ స్థానంలో నమన్ ధీర్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో తాజాగా మార్పు చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో నమన్ ధీర్ కు అవకాశం కల్పించారు. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో వాషింగ్టన్ సుందర్ తన రాష్ట్ర జట్టుకు రెడ్-బాల్ క్రికెట్ ఆడుతూ టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉంది.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఉన్నారు.
భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్.
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే ఈ ఐదు టీ20 మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ను అందించనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో అక్టోబర్ 14న జరగనున్న నాలుగో టీ20పై తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!