India vs Sri Lanka 3rd ODI: తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య చివిరిదైన మూడో వన్డే ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వన్డేలను గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా, చివరిదైన మూడో వన్డేలో కన్నేసింది. క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఈ వన్డేలో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది. తుది జట్టులో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఉమ్రాన్ మాలిక్, హార్ధిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగతున్నారు. విరాట్ కోహ్లీకి శ్రీలంకపై ఇది 50వ వన్డే కావడం విశేషం. ఇక శ్రీలంక జట్టులో ధనంజయ డి సిల్వా, దునిత్ వెల్లలగే స్థానాల్లో అషెన్ బండా, జెఫ్రీ వాండర్సే తుదిజట్టులోకి చేరారు.
Read Also: Tummala Nageshwar Rao: 18న దేశ రాజకీయాల్లో మార్పుకి ఖమ్మం వేదిక కానుంది
భారత జట్టు వివరాలు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు వివరాలు:
శ్రీలంక (ప్లేయింగ్ XI): అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), అషెన్ బండార, చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార.