Site icon NTV Telugu

India vs Pakistan : ఆసియా కప్‌లో రసవత్తర పోరు.. దుబాయ్‌లో భారత్‌-పాక్‌ ఢీ

India Vs Pakistan

India Vs Pakistan

ఆసియా కప్‌లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. అసలు సిసలైన మ్యాచ్‌కి సమయం ఆసన్నమైనది.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్‌… యుఏఈ వేదికగా తలపడనున్నాయి… దాయాది జట్ల మధ్య రసవత్తర పోరు జరిగితే ఆ మ్యాచ్.. ఓ చిన్న యుద్ధంలాగే ఉంటుంది. ఎప్పుడూ క్రికెట్‌ చూడనివారు కూడా.. ఈ మ్యాచ్‌ చూసి తీరుతుంటారు.. అభిమానుల కోలాహోలం మధ్య ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనప్పటికీ.. ఐసీసీ టోర్నీ, ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో ఇరుజట్లు తలపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఓటమి బదులు తీర్చుకోవాలని భారత్‌ వ్యూహాలు రచిస్తోంది. వెస్టిండీస్‌, జింబాబ్వేలో… సిరీస్‌లు గెలుపొంది మంచి ఊపుమీదుంది టీమిండియా. అదే జోరును ఆసియా కప్‌లోనూ కొనసాగించాలని భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Read Also: TS constable exam 2022: నేడు కానిస్టేబుల్ రాతపరీక్ష… ఇవి నిబంధనలు మరవొద్దు..

ఆసియా కప్‌లో భారత్‌ రికార్డు అద్భుతంగా ఉంటే… పాకిస్తాన్‌ జట్టు ట్రాక్‌ రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. రెండు సార్లు మాత్రమే ఆ జట్టు ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. ఆసియా కప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న భారత్… మరోసారి ముద్దాడాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆకాంక్షించారు. టీమిండియా రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లీ… ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జట్టు సమతూకంతో ఉంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, హర్దిక్ పాండ్యా, రిషభ్‌ పంత్, దినేష్‌ కార్తీక్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్, అశ్విన్‌, చాహల్, అవేశ్‌ ఖాన్, అర్షదీప్‌ సింగ్‌లు ఉన్నారు.

ఇక, విరాట్ కోహ్లీ, యజువేంద్ర చాహల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లను మైదానంలో కలిసి కాసేపు మాట్లాడాడు అఫ్రిదీ. ముఖ్యంగా పంత్-అఫ్రిదీ కలిసి ఒకరిపై మరొకరు జోకులు వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్‌ చేసింది.. పంత్‌తో కలిసి జోకులు పేల్చాడు అఫ్రిదీ. పంత్ మాదిరిగా ఒంటి చేత్తో సిక్సర్లు బాదాలని తాను అనుకున్నట్లు అతడితో అంటాడు అఫ్రిదీ. దీంతో ఇద్దరూ కాసేపు నవ్వుకుంటారు. ఈ వీడియోలు.. మ్యాచ్‌ ముందే వైరల్‌గా మారిపోయాయి..

Exit mobile version