IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే భారత్ కోల్పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ వైట్‌వాష్ కాకుండా చూసుకోవాల్సిన దానిపై టీమిండియాపై ఉంది. అందుకు తగ్గట్టుగానే ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు బాగా రాణించారు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో మొదటిరోజు కివీస్‌ను 235 రన్స్ కే ఆలౌట్ చేశారు. బ్యాటింగ్‌లో మాత్రం ఇప్పటికే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 86/4 స్కోరుతో భారత్ కొనసాగుతోంది. ఇంకా 149 రన్స్ వెనకబడి ఉంది. ఈక్రమంలో ఇవాళ (శనివారం) ఆట అత్యంత కీలకమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ఆధిక్యం సాధిస్తేనే మ్యాచ్ విజయంపై టీమిండియాకు ఆశలు ఉంటాయి. అలా జరగాలంటే మొదటి సెషన్ అత్యంత కీలకం కానుంది. ఈ సెషన్‌లో వికెట్లు పడకుండా.. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు చేరువవ్వాలి.
Read Also: Daali Dhananjay: గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్న ‘జాలిరెడ్డి’.. పెళ్లి ఎప్పుడంటే
ఇక, తొలిరోజు భారత బౌలర్లు దాదాపు 66 ఓవర్లు వేయగా.. 11 ఓవర్లు మాత్రమే పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ సంధించారు. మిగతా 55 ఓవర్లను స్పిన్నర్లు రవీచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వేశారు. 10 వికెట్లలో 9 వికెట్లు ఈ స్పిన్ దయం పడగొట్టారు. ఇక కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 14 వికెట్లలో ఒకటి రనౌట్ కాగా.. మిగతా 11 వికెట్లను స్పిన్నర్లే తీసుకున్నారు. తొలిరోజు నుంచే స్పిన్‌దే ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రోజులన్నింట్లోనూ మరింత సవాల్ ఎదురుకానుంది. నాలుగో ఇన్నింగ్స్ ఆడటం మరింత కష్టంగా మారే అవకాశం ఉంది.
కాగా, 150 నుంచి 200 రన్స్ టార్గెట్‌ను కూడా ఛేదించడం టీమిండియాకు కష్టంగా మారుతుంది. ఇప్పుడు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 150కి పైగా ఆధిక్యంలోకి పోవాలి. అప్పుడు కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా కట్టడి చేసేందుకు బౌలర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు అవుతుంది. వారిని 250కే ఆలౌట్ చేస్తే టీమిండియాకు విజయం దక్కే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకపోతే 3 టెస్టుల సిరీస్‌ను తొలిసారి వైట్‌వాష్ ప్రమాదం నుంచి బయటపడటం భారత్ కు కష్టంగా మారనుంది.