India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Japan T20 Broadcast: 2026 ఆసియా క్రీడలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీమిండియా ఓ చారిత్రాత్మక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. భారత పురుషుల క్రికెట్ జట్టు తొలిసారిగా జపాన్‌తో ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఇప్పటివరకు భారత్, జపాన్ జట్లు ఏ క్రికెట్ ఫార్మాట్లోనూ తలపడలేదు. దాంతో ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ మ్యాచ్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టెలివిజన్ ప్రసార హక్కుల విషయంలో జపాన్ క్రికెట్ అసోసియేషన్ ఇంకా బ్రాడ్‌కాస్టింగ్ భాగస్వామిని ఖరారు చేయలేదని సమాచారం. ఆసియా క్రీడల ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు ఈ మ్యాచ్ జరగడం వల్ల లాజిస్టిక్స్, ప్రసార ఏర్పాట్లు క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. జపాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రసార హక్కుల కోసం ఐటీడబ్ల్యూ యూనివర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఐటీడబ్ల్యూ సంస్థ స్టార్, సోనీ, జీ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టీవీ డీల్ తుది దశకు చేరకపోతే.. ఈ చారిత్రక మ్యాచ్‌ను చివరకు యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారట .
Also Read
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
- Asian Para Games 2026 : భారత్ కు మరో స్వర్ణం.. స్ప్రింటర్ సిమ్రాన్‌కు స్వర్ణం..
- Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
- Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
భారత్‌లో ఈ మ్యాచ్ ప్రసారానికి ఫ్యాన్‌కోడ్ రేసులో ఉన్నట్లు సమాచారం. గతంలో జపాన్ క్రికెట్ అసోసియేషన్‌తో ఫ్యాన్‌కోడ్ కలిసి పనిచేసిన నేపథ్యంలో.. టెక్నికల్, ప్రసార పరంగా అది ఒక అవకాశంగా కనిపిస్తోంది. బ్రాడ్కాస్టర్లకు అసలు చిక్కు ఏంటంటే.. భారత్ పురుషుల జట్టు జపాన్‌తో మ్యాచ్ ఆడే సమయానికి.. భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2026 ఫైనల్లో ఆడే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ ఐచి ప్రిఫెక్చర్‌లోని నిషిన్ సిటీలో ఉన్న కొరోగి అథ్లెటిక్ పార్క్‌లో జరగనుంది.
భారత మహిళల జట్టు ఆసియా కప్ 2026 టోర్నీలో ఫేవరెట్‌గా ఉండటంతో.. ఒకేసారి రెండు కీలక మ్యాచ్‌లపై ప్రేక్షకుల ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. దీంతో ప్రసార హక్కులు దక్కించుకునే సంస్థలకు రెండు మ్యాచ్‌లను దాదాపుగా ఒకే సమయంలో కవర్ చేయడం, ప్రత్యేక ప్రసార బృందాలు ఏర్పాటు చేయడం పెద్ద సవాల్‌గా మారవచ్చు. భారత్-జపాన్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌కు క్రీడా పరంగా మాత్రమే కాకుండా.. దౌత్యపరంగానూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘Sport 75’ కార్యక్రమాన్ని ఈ మ్యాచ్‌తో ప్రారంభించనున్నారు. చారిత్రాత్మక మ్యాచ్‌కు ముందు ఈ బ్రాడ్‌కాస్టింగ్ గందరగోళాన్ని నిర్వాహకులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!