Site icon NTV Telugu

IND vs ENG 3rd Test: నేడు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్.. లార్డ్స్‌ మైదానంలో గెలిచేదెవరో..?

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG 3rd Test: భారత్ వర్సెస్ ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీస్ లో మరో పోరుకు రంగం సిద్ధమైంది. 1–1తో ఇప్పటికే సిరీస్‌ సమంగా ఉన్న స్థితిలో నేడు ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య 3వ టెస్టు ప్రారంభం కాబోతుంది. టీమిండియా బర్మింగ్‌హామ్‌ ప్రదర్శనను బట్టి చూస్తే జట్టు సన్నద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక్కడా గెలిస్తే సాధిస్తే 2–1తో ముందుకు దూసుకుపోయి ఆపై సిరీస్‌ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి శుభ్మన్ గిల్‌ బృందం మరింత పట్టు బిగించాలని ప్లాన్ చేస్తుంది. జట్టులో అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపిస్తున్న ఇంగ్లాండ్‌ ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Read Also: KCR Health Update: నేడు మరోసారి యశోదా హాస్పిటల్‌కు వెళ్లనున్న మాజీ సీఎం..!

అయితే, సిరీస్‌లో రెండు టెస్టుల్లో టీమిండియా మంచి బ్యాటింగ్‌ ప్రదర్శన చేసింది. టాప్‌–6లో కరుణ్‌ నాయర్‌ మినహా మిగతా వారంతా సెంచరీ లేదా కనీసం హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, గిల్, రిషభ్‌ పంత్‌ ఇప్పటికే శతకాలు బాదగా.. రవీంద్ర జడేజా ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్థ శతకాలతో తన బ్యాటింగ్‌ పదును ఇంగ్లీష్ జట్టుకు చూపించాడు. ముఖ్యంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న కెప్టెన్ గిల్‌ను ఇంగ్లాండ్‌ బౌలర్లు ఆపలేకపోతున్నారు. ఫెయిల్యూర్స్ ఉన్నా సరే, కరుణ్ నాయర్‌కు సిరీస్‌లో మరో ఛాన్స్ దక్కవచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also: Kollywood : అదును చూసి నయనతారపై రివెంజ్ తీర్చుకుంటున్నారు

ఇక, భారత జట్టు బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పూ ఉండదు.. కానీ, బౌలింగ్‌లో బుమ్రా ఆడటం ఫిక్స్ కావడంతో ప్రసిధ్‌ కృష్ణ స్థానంలో అతను టీమ్ లోకి రానున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చెలరేగిన ఆకాశ్‌దీప్, సిరాజ్‌లకు ఇప్పుడు బుమ్రా జత కలిస్తే బౌలింగ్‌లో మనకు తిరుగుండదని చెప్పుకొవాలి.. అలాగే, ఎక్స్ ట్రా స్పిన్నర్‌ కావాలని అనుకుంటే నితీశ్‌ కుమార్‌ రెడ్డి ప్లేస్ లో కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఎలాగూ, స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ మరోసారి జట్టులో కీలకం కానున్నారు.

Read Also: Samsung Galaxy S24 5G: ఆలోచించిన ఆశాభంగం.. ఆ ప్రీమియం ఫోన్ పై ఏకంగా రూ.37,000కి పైగా తగ్గింపు!

కాగా, ఎప్పటిలాగే మ్యాచ్‌కు ముందు రోజే తమ తుది జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది. జోష్‌ టంగ్‌ ప్లేస్ లో ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు స్థానం కల్పించింది. అతని వేగం తమకు అదనపు బలంగా మారుతుందని స్టోక్స్ సేన భావిస్తుంది. అయితే, ఆర్చర్‌ ఏకంగా 4 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఏమాత్రం ఎఫెక్ట్ చూపిస్తాడు అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే, ఈ టెస్టు కోసం ఎంపిక చేసిన అట్కిన్సన్‌ గాయంతో తప్పుకోవడంతో స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌పైనే ఇంగ్లాండ్‌ పూర్తి నమ్మకం పెట్టుకుంది. ఇక, ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంగ్లీష్ టీమ్ బ్యాటింగ్‌ పదునెక్కాల్సి ఉంది.

Read Also: Bhumana Karunakar Reddy: జగన్ అంటే జనం.. నేటి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసింది!

అయితే, లార్డ్స్‌ పిచ్‌పై బ్యాటింగ్ లో చుక్కలు కనిపిస్తాయి. ఇక్కడ ఆథిత్య జట్టు బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ టీమిండియా పేసర్లను ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి. ఒలీ పోప్‌తో పాటు జో రూట్‌ కూడా తమ అంచనాలను అందుకోవాల్సి ఉంది. ఇక, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్‌ ఫామ్‌లో ఉన్నారు.. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌ మాత్రం కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. అతను ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడి ఇప్పటికీ చాలా కాలమైంది. ఇప్పుడైనా స్టోక్స్ తన బ్యాటింగ్ బలాన్నీ చూపిస్తే ఇంగ్లాండ్ జట్టుకు ఎంతో కలిసి వస్తుంది. మరోవైపు, ఈ పిచ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఆరంభంలోనే కాస్త పేస్ బౌలింగ్ కు అనుకూలించినప్పటికీ.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసేందుకు స్కోప్ ఉంటుంది. ఈసారి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. మ్యాచ్ రోజుల్లో వర్ష మాత్రం సూచన లేదు.

Read Also: Teachers Make Drugs: ఈ సైన్స్ టీచర్ల రూటే వేరు.. స్కూల్ కు ఎగ్గొట్టి.. డ్రగ్స్‌ తయారు చేస్తున్న వైనం

తుది జట్ల వివరాలు
టీమిండియా జట్టు: శుభ్మన్ గిల్‌ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, సుందర్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్‌ యాదవ్.

ఇంగ్లండ్‌ జట్టు: బెన్ స్టోక్స్‌ (కెప్టెన్), క్రాలీ, బెన్ డకెట్, పోప్ ఒలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, కార్స్, జోఫ్రా ఆర్చర్, బషీర్‌.

Exit mobile version