నయనతార సినిమా ఓపెనింగ్స్‌కు రాదు, ప్రమోషన్స్ చేయదు. లేడీ సూపర్ స్టార్‌తో వర్క్ చేయించుకోవాలంటే కష్టం. ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ. ఇలా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి సౌత్ క్వీన్ పై బలంగా వినిపించిన మాటలు. కానీ వాటన్నింటినీ ఈ మధ్య కాలంలో చెక్ పెట్టింది భామ. ప్రమోషన్లే కాదు ఓపెనింగ్‌కు వచ్చి బౌండరీలను చెరిపేసింది. కానీ అప్పటికే లేడీ సూపర్ స్టార్ కోలీవుడ్‌లో టార్గెట్ అయ్యింది. ఎప్పుడూ దొరుకుతుందా అనుకునే టైంలో ఆమెను చిక్కుల్లో పడేసింది డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ రిలీజ్‌కు ముందే నుండే కాంట్రవర్సీలో చిక్కుకుంది. కాదు కాదూ కొని తెచ్చుకుంది నయన్.
నానుమ్ రౌడీ ధాన్ సీన్స్ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వినియోగించారంటూ ధనుష్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కాడు. రూ. 10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇక ధనుష్‌పై మండిపడుతూ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది నయన్. అలాగే భర్త విఘ్నేశ్ శివన్ కూడా కౌంటరిచ్చాడు. ప్రజెంట్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది నయనతారకు. చంద్రముఖిలో కొన్ని సీన్స్ అనుమతి లేకుండా యూజ్ చేశారంటూ ఏబీ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. రూ. 5 కోట్లు చెల్లించాలంటూ కోరింది. ఇప్పుడే కాదు గతంలో కూడా చంద్రముఖి నిర్మాతలు నోటీసులు పంపారంటూ వార్తలు రాగా.. వాటిని ఖండించారు శివాజీ ప్రొడక్షన్స్. కానీ ఇప్పుడు ఈ సినిమా కాపీ రైట్స్ కలిగి ఉన్న ఏబీ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలు చేయడం చూస్తే కావాలనే ఆమెను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమౌతోంది. గతంలో ప్రమోషన్లకు, ఈవెంట్లకు రాకుండా కోలీవుడ్‌ను ఇబ్బంది పెట్టిన నయనతారపై ఇలా రివేంజ్ స్టార్ట్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీ వల్ల లేడీ సూపర్ స్టార్ వెయిట్ పెరగడం కన్నా డ్యామేజే ఎక్కువగా జరిగింది. ప్రజెంట్ ఎనిమిది ప్రాజెక్టులతో బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్ ఈ వివాదాలకు ఫుల్ స్టాఫ్ పెడుతుందా. మళ్లీ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేస్తుందో లెట్స్ సీ.