IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20కి భారత జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనైనా ఆసీస్ ను సమర్థంగా ఎదుర్కుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. కావునా, ఈ మ్యాచ్ లో వీళ్లిద్దరు బ్యాట్ ఝళిపించడం జట్టుకు ఎంతో అవసరం. అలాగే, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె కూడా పరుగులు చేయాల్సి ఉంది. అయితే, ఆసీస్ ప్రధాన పేసర్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం భారత్ జట్టుకు సానుకూలాంశం.
Read Also: Lavanya-Varun Tej : యానివర్సరీ సెలబ్రేషన్స్ లో.. లావణ్య వరుణ్ స్పెషల్ పోస్ట్
అయితే, వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఈ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే సూర్య సేన ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే, ఈ మ్యాచ్‌కైనా తుది జట్టులోకి అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలుస్తుందనే ధీమాగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో చిన్న మార్పులో కంగారు జట్టు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. త్వరలో యాషెస్ సిరీస్ ఉండటంతో హేజిల్‌వుడ్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా రెస్ట్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో మిగతా మ్యాచ్‌ల్లోనూ హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండడు. హేజిల్‌వుడ్ ప్లేస్ లో సీన్ అబాట్ టీమ్ లోకి రావొచ్చు. అలాగే, గాయం నుంచి కోలుకున్న మ్యాక్స్‌వెల్.. ఒవెన్ లేదా షార్ట్ స్థానంలో ఆడే అవకాశం కనిపిస్తుంది. కాగా, ఈరోజు జరిగే మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదని తెలిపారు.
