Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్‌తో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ గురువారం ధృవీకరించారు. ఐపీఎల్ 2026 ముగిసిన కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటంతో ఆటగాళ్ల శారీరక, మానసిక సన్నద్ధతపై కోచ్ కీలక విషయాలు పంచుకున్నారు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్లో సిరాజ్ బౌలింగ్ చేశాడని, అతను చాలా బాగున్నాడని స్పష్టం చేశారు. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వడంతో జట్టులో స్పిన్ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు హర్ష్ దూబే లేదా మానవ్ సుతార్‌లలో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కవచ్చని ఆయన హింట్ ఇచ్చారు.
గుజరాత్ టైటాన్స్ జట్టు నుండి ఏడుగురు ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఐదు రోజులకే ఈ సుదీర్ఘ ఫార్మాట్‌కు సిద్ధమవడం ఒక పెద్ద సవాలు అని కోచ్ పేర్కొన్నారు. ఐపీఎల్ రాత్రి వేళల లైఫ్ స్టైల్ నుండి టెస్ట్ క్రికెట్ ఉదయం వేళలకు ఆటగాళ్లను మార్చడానికి వారి ‘స్లీప్ సైకిల్’ (నిద్ర వేళలు) సర్దుబాటు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. ఇందుకోసం స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ ఉదయాన్నే జిమ్ సెషన్లు ప్లాన్ చేశారని తెలిపారు. అలాగే, ఐపీఎల్ టీ20 అలవాట్ల నుండి ఆటగాళ్లను దూరం చేసి, రెడ్ బాల్ క్రికెట్‌కు అనుగుణంగా మార్చేందుకు ఈ మూడు రోజుల ప్రాక్టీస్ సెషన్లను ఒక ‘డీటాక్స్’ లాగా ఉపయోగించినట్లు చెప్పారు.
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్‌మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ఇక చతేశ్వర్ పుజారా దూరం అయినప్పటి నుండి జట్టులో 3వ బ్యాటింగ్ స్థానం గురించి కూడా ఆయన మాట్లాడారు. డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించిన దేవదత్ పడిక్కల్, అలాగే ఐపీఎల్లో అదరగొట్టిన సాయి సుదర్శన్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారని, ఎవరికి అవకాశం ఇచ్చినా వారికి తగినన్ని అవకాశాలు ఇచ్చి ఆ స్థానంలో స్థిరపడేలా చూస్తామని డోస్కాట్ భరోసా ఇచ్చారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే 34-35 డిగ్రీల ఎండలో టెస్ట్ మ్యాచ్ ఆడటం కష్టమే అయినా.. భారత ఆటగాళ్లు ఈ సవాలును ధీటుగా ఎదుర్కొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!