IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing 11 vs WI 4th T20: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు ఇరు జట్లు హైదరాబాద్‌లో జరిగే నాలుగో టీ20కి సిద్ధమవుతున్నాయి. బుధవారం రాత్రి (అక్టోబర్ 14) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా.. పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండీస్ పట్టుదలతో ఉంది.
ఓపెనర్లుగా అభిషేక్, సంజు:
హైదరాబాద్ టీ20లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇండోర్‌లో సంజు పరుగులు చేయలేకపోయినా.. అంతకుముందు రాంచీలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. హైదరాబాద్ మైదానంలోనూ అతడికి మంచి రికార్డు ఉండటంతో అతడే బరిలోకి దిగనున్నాడు. దాంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి షాక్ తగలనుంది. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్‌కు రానున్నారు. ఈ టాప్ ఆర్డర్‌పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే కీలక సమయంలో బ్యాటర్లు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
Also Read
- West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Vaibhav Sooryavanshi: "ఇది నిరంకుశత్వం".. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
- Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
ఆల్‌రౌండర్లతో బరిలోకి భారత్:
నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్‌లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు కాబట్టి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడగలరు. గత మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు బ్యాట్, బంతితో రాణించడంతో హైదరాబాద్‌లోనూ ఆల్రౌండర్లపైనే జట్టు యాజమాన్యం నమ్మకం ఉంచే అవకాశముంది.
కుల్దీప్ యాదవ్‌కు అవకాశం?:
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాస్త పెద్ద మైదానం కావడంతో బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ప్రిన్స్ యాదవ్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ పేస్ బాధ్యతలు పంచుకొనున్నారు. చూడాలి మరి కెప్టెన్ శ్రేయాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో.
హైదరాబాద్ టీ20కి భారత ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
సంజు శాంసన్ (వికెట్ కీపర్)
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
తిలక్ వర్మ
నమన్ ధీర్
నితీష్ కుమార్ రెడ్డి
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
అర్ష్‌దీప్ సింగ్
మయాంక్ యాదవ్
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!