IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI 4th T20I Playing 11: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలంటే వెస్టిండీస్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. రెండో టీ20లో రాంచీలో ఓటమి పాలైన భారత్.. మూడో మ్యాచ్‌లో ఇండోర్ వేదికగా పుంజుకుంది. అదే ఊపును ఉప్పల్ మైదానంలో కొనసాగించాలని చూస్తోంది.
ఫామ్‌లో టీమిండియా:
అభిషేక్ శర్మ ఇటీవలి మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత 10 మ్యాచ్‌ల్లో 409 పరుగులు చేసి, 236 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసాడు. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ గత ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. సంజు శాంసన్ నిలకడ సాధించాల్సిన అవసరం ఉంది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైతే నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్ ఉండనే ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ అభిషేక్, నితీశ్‌కు ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉండడం భారత్‌కు సానుకూలాంశం. అర్ష్‌దీప్ సహా ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ పేస్ భారాన్ని పంచుకుంటారు.
Also Read
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
- Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
- Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
హోప్, రూథర్‌ఫర్డ్ కీలకం:
వెస్టిండీస్ తరఫున కెప్టెన్ షాయ్ హోప్, రూథర్‌ఫర్డ్ కీలక ఆటగాళ్లుగా నిలవనున్నారు. హోప్ గత 10 టీ20 మ్యాచ్‌ల్లో 367 పరుగులు చేయగా, రూథర్‌ఫర్డ్ 321 పరుగులు సాధించాడు. హిట్టర్లు హెట్మయర్, కామిల్ పూరన్, స్ప్రింగర్, రోమన్ పావెల్ కూడా ఉండడంతో కరీబియన్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. గత మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్ షెపర్డ్ ఆడడం అనుమానమే. భారత బ్యాటర్లను నియంత్రించాలంటే బౌలింగ్‌లో వెస్టిండీస్ మెరుగుపడాలి.
పిచ్ రిపోర్ట్:
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇక్కడ బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుంది. అవుట్‌ఫీల్డ్ వేగంగా ఉండటంతో బ్యాటర్లు బౌండరీలు సాధించేందుకు మంచి అవకాశాలు ఉంటాయి. ఈ మైదానంలో 2024 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297/6 పరుగులు చేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఈ వేదికపై నమోదైన అత్యధిక స్కోరు. మ్యాచ్ ముందుకు సాగేకొద్దీ స్పిన్నర్లకు కొంత సహకారం లభించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
మ్యాచ్ ఎక్కడ చూడాలి?:
భారత్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.
వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కైల్మ్ పూరన్, షిమ్రాన్ హెట్మయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెఫర్డ్, రోస్టన్ చేజ్, షమర్ స్ప్రింగర్, కీమో పాల్, షమర్ జోసెఫ్, గుడాకేశ్ మోటీ.
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!