IND vs SL: నేడు భారత్, శ్రీలంక మూడో టీ20.. అభిమానులకు ప్రత్యేక సందర్భం!
- నేడు భారత్, శ్రీలంక మూడో టీ20
- సిరీస్ పట్టేయాలని చూస్తోన్న భారత్
- అభిమానులకు ప్రత్యేక సందర్భం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 నుంచి మూడో టీ20 ఆరంభం కానుంది. వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన భారత్.. మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం శ్రీలంకకు సవాలే అని చెప్పాలి. విశాఖలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన లంక.. మూడో మ్యాచ్‌లో ఏ మేరకు పోటీని ఇస్తుందో చూడాలి.
తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు, బౌలర్లు సత్తా చాటారు. స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మలతో పాటు పేసర్ క్రాంతి గౌడ్ రాణిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురు లంక బ్యాటర్లను పరుగులు చేయనీయలేదు. తొలి టీ20లో 121 పరుగులకే పరిమితమైన లంక.. రెండో టీ20లో 128 పరుగులే చేసింది. దాంతో మూడో మ్యాచ్‌లోనూ భారత బౌలర్ల నుంచి మరోసారి మంచి ప్రదర్శనను టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. జెమీమా, షెఫాలి వర్మ అర్ధ సెంచరీలతో జోరుమీదున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన మంధాన భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. జ్వరం కారణంగా రెండో మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. మూడో మ్యాచ్ ఆడనుంది. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియాకు తిరుగులేదు.
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. తొలి మ్యాచ్‌లో 121/6, రెండో మ్యాచ్‌లో 128/9 మాత్రమే చేయగలిగింది. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే లంక బ్యాటర్లు సత్తాచాటాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ చమరి బాధ్యతగా ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో విష్మి గుణరత్నే 39 పరుగులు, రెండో మ్యాచ్‌లో హర్షిత సమరవిక్రమ 33 పరుగులు చేశారు కానీ.. ఆ ఇన్నింగ్స్‌లు జట్టుకు సరిపోలేదు. తిరువనంతపురం అభిమానులకు ఇది ప్రత్యేక సందర్భం అనే చెప్పాలి. తొలిసారిగా మహిళల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు తిరువనంతపురం ఆతిథ్యం ఇస్తోంది. అందుకే స్థానిక ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.
జట్లు:
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ కమలిని (వికెట్ కీపర్), ఎన్. శ్రీచరణి, వైష్ణవి శర్మ.
శ్రీలంక: చమరి అథపత్తు (కెప్టెన్), హసిని పెరేరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, నిలక్షిక డి సిల్వా, కవిషా దిల్హారి, ఇమేషా దులానీ, కౌషిణి నుత్యాంగన, మల్షా షేహని, ఇనోకా రణవీర, శశిని గిమ్హాని, నిమేషా మదుషానీ, కావ్య కవింది, రష్మిక సేవ్వండి, మల్కీ మదారా.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!