IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL 2nd Test Injury Update: గాలె వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 165 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక కొలంబో వేదికగా రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి ఆరంభం కానుంది. సొంత గడ్డపై మొదటి టెస్టులో ఇప్పటికే కంగుతిన్న శ్రీలంకకు.. రెండో టెస్టుకు ముందు డబుల్ షాక్ తగిలింది. స్టార్ ఆటగాళ్లు దినేష్ చండిమాల్, కుశాల్ మెండిస్ అందుబాటులో లేకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. పాథుమ్ నిస్సాంక కూడా తదుపరి టెస్టుకు దూరం కానున్నట్లు తెలిపాడు. దీంతో భారత్‌తో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న శ్రీలంకకు భారీ షాక్ తగిలింది.
కుశాల్ మెండిస్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రంగా ఉందని గ్యారీ కిర్‌స్టెన్ తెలిపాడు. అతడు కొన్ని రోజుల పాటు జట్టుకు అందుబాటులో ఉండే ఉండడని చెప్పాడు. తొడకండరాల గాయంతో ఓపెనర్ పాథుమ్ నిస్సాంక రెండో టెస్టులో ఆడడం లేదు. తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో దినేష్ చండిమాల్ గాయపడ్డాడు. అతడి తల, మెడకు గాయమైంది. మైదానంలోనే అస్వస్థతకు గురికావడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చండిమాల్ స్థానంలో పాసిందూ సూర్యబండార కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. వైద్యుల సలహా మేరకు చండిమాల్‌ను రెండో టెస్టు నుంచి తప్పించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
- IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
దినేష్ చండిమాల్, పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్‌లు దూరం కావడం యువ క్రికెటర్లకు మంచి అవకాశంగా మారుతుందని గ్యారీ కిర్‌స్టెన్ అభిప్రాయపడ్డాడు. ‘దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి రికార్డులు ఉన్న ఆటగాళ్లకు జాతీయ జట్టులో తమ సత్తా నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. తొలి టెస్టులో భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. శ్రీలంక ఆటగాళ్లు టెస్టు క్రికెట్లో చూపిన పోరాట పటిమను చూపించడం సంతోషంగా ఉంది. శ్రీలంక క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే టెస్టు క్రికెట్లో జట్టు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. టెస్టు క్రికెట్‌ను ఎక్కువగా ఆడకపోవడం వల్ల ఈ ఫార్మాట్లో ఎలా ఆడాలో అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో జట్టులో మరింత మెరుగైన ప్రదర్శన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము’ అని కిర్‌స్టెన్ తెలిపాడు.
‘గాలె టెస్టులో ఒక దశలో శ్రీలంక 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ కోలుకుని మ్యాచ్‌ను ఐదో రోజు మధ్యాహ్నం వరకు తీసుకెళ్లడం సానుకూల అంశం. చివరి రోజు ఉదయం కూడా మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం చేయగలమనే నమ్మకం మాకు కలిగింది. కనీసం మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉందని భావించాము. జట్టు ఆటగాళ్లలో కనిపించిన ఉత్సాహం, పోరాట తత్వం నాకు నచ్చింది. టాప్ ఆర్డర్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మా బ్యాటర్లు విఫలమవడం ఓటమికి ప్రధాన కారణం. యువ బ్యాటర్ సోనల్ దినూష బాగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేసి శ్రీలంక తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. టెస్టు క్రికెట్‌పై దినూషకు ఉన్న ఆసక్తి, సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాలనే అతడి విధానం నన్ను ఆకట్టుకున్నాయి. టెస్టుల్లో ఎక్కువసేపు క్రీజులో నిలవడం, పరుగులు సాధించడం, మ్యాచ్‌పై ప్రభావం చూపించడం వంటి అంశాలను యువ ఆటగాళ్లు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కింది’ అని కిర్‌స్టెన్ తెలిపాడు. గాయాలతో సతమతం అవుతున్న శ్రీలంకపై విజయం సాధించడం టీమిండియాకు ఈజీనే అని చెప్పాలి.
తాజావార్తలు
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!