IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. అప్పుడే శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టింది. మూడో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి లంక మూడు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. దీంతో భారత్ ఇంకా 382 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేస్తే.. ఇన్నింగ్స్ తేడాతోనూ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ చెటేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు.
చెటేశ్వర్ పుజారా మాట్లాడుతూ.. ‘భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఇప్పటికే మ్యాచ్‌పై పట్టు సాధించింది. 500కు పైగా పరుగులు చేసిన భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయే అవకాశం చాలా తక్కువ. మూడో రోజు భారత్ బౌలర్లు తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం కూడా సాధ్యమే. టీమిండియా బ్యాటర్లు బోర్డుపై సరిపడా పరుగులు ఉంచారు. భారత్ గెలవడానికి 500 పరుగులు చాలు అని’ విశ్లేషించాడు.
Also Read
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
రెండో రోజు భారత్ భారీ స్కోరు సాధించడంలో ధ్రువ్ జురెల్ కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్టులో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న జురెల్.. కొలంబోలో మరింత బాధ్యతగా బ్యాటింగ్ చేసి 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 177 బంతులు ఎదుర్కొన్న అతడి ఇన్నింగ్స్‌లో సింగిల్స్, డబుల్స్‌తో పాటు బౌండరీలు కొడుతూ అద్భుతంగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రిషభ్ పంత్‌తో కలిసి జురెల్ 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం మానవ్ సుతార్‌తో కలిసి 39 పరుగులు జోడించి భారత్‌ను 500 పరుగుల దిశగా నడిపించాడు.
రెండో రోజు ఆరంభంలో రిషభ్ పంత్‌పై అందరి దృష్టి నిలిచింది. తొలి రోజు చేతికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన పంత్.. మరుసటి రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. శ్రీలంక పేసర్లు వరుసగా షార్ట్ బంతులతో అతడిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. అయినా పంత్ ధైర్యంగా వాటిని ఎదుర్కొని 63 పరుగులు చేశాడు. పంత్ తనదైన దూకుడుతో బ్యాటింగ్ చేస్తూ లాహిరు కుమార బౌలింగ్‌లో భారీ సిక్సర్ కూడా కొట్టాడు. కేశర నువంత బౌలింగ్‌లో పుల్ షాట్‌తో బౌండరీ సాధించి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే లంచ్ తర్వాతే అతడి ఇన్నింగ్స్ ముగిసింది. పంత్ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా జురెల్‌పై పడింది. కేవలం 12 టెస్టుల అనుభవం ఉన్నప్పటికీ.. ఎంతో పరిణతి చెందిన బ్యాటర్లా పరిస్థితులను అర్థం చేసుకుని జురెల్ బ్యాటింగ్ చేశాడు.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!