Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించింది. ఈ భారీ యాక్షన్ డ్రామా రిలీజ్ మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అందుకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా భారీగా టికెట్స్ సేల్స్ జరుగుతున్నాయి. అయితే నైజాంలో ఈ సినిమా బుకింగ్స్ లో తర్జన భర్జనలు జరుగుతుండగా తాజాగా నైజాం ప్రాంతంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన అధికారిక జీవో విడుదలైంది.
ఈ జీవో ప్రకారం, సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలతో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ లో రూ. 50 అలాగే మల్టిప్లెక్స్ లో రూ 100 పెంచుతూ జీవో జారీ చేసారు. దాంతో నైజాం పరిధిలోని థియేటర్ల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ రూ. 227, మల్టీప్లెక్స్‌లు రూ. 395 అయ్యాయి. జీవో వెలువడటంతో నైజాం వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ‘బుక్ మై షో’ ‘డిస్ట్రిక్ట్ ఇండియా’ లలో ప్రారంభం అయ్యాయి. యష్ అభిమానులు ఈ బిగ్ అప్డేట్తో పండగ చేసుకుంటున్నారు. కెజిఎఫ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యష్ నటించిన సినిమా కావడంతో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్టే కన్నడ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి.
Also Read
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!