Site icon NTV Telugu

IND vs SA: 408 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. సిరీస్ వైట్‌వాష్‌!

Team India Whitewash

Team India Whitewash

సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయంను చవిచూసింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్‌ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ ఓటమితో టీమిండియా టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. గత నవంబరులో సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో భారత్ వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే.

Also Read: Team India: టీమిండియాకు గాయాల బెడద.. స్టార్ ఆటగాళ్ల జాబితా పెద్దదే!

549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. నాలుగో రోజు 27 పరుగులకే రెండు వికెట్స్ కోల్పయింది. చివరి రోజు 522 పరుగులు చేజ్ చేయాల్సి ఉండగా.. చేతిలో 8 వికెట్స్ ఉన్నాయి. మ్యాచ్ గెలవడం కష్టమే అయినా.. కనీసం డ్రా కోసమైనా ప్రయత్నిస్తుందని అందరూ భావించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ ప్రశాంతంగా ఆడుతూ భారీగా రన్స్ చేసిన అదే పిచ్‌పై మనోళ్లు మాత్రం తేలిపోయారు. టాప్ బ్యాటర్లు ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. సైమన్ హార్మర్‌ దెబ్బకు వరుసగా పెవిలియన్ చేరారు. జడేజా హాఫ్ సెంచరీ చేయకుంటే.. ఓటమి 100 రన్స్ లోపే ఆలౌట్ అయ్యేది. టెస్టుల్లో ఇదే భారత జట్టుకు ఇదే అతి పెద్ద పరాజయం. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 రన్స్ చేయగా.. భారత్‌ 201 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

Exit mobile version