IND vs SA: ముగిసిన తొలిరోజు ఆట.. భారత్‌పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం!
- గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు
- దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 రన్స్
- భారత్‌పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది. ముత్తుస్వామి (25), కైల్ వెరినె (1) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్స్ పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రోజు సఫారీలే ఆధిపత్యం చెలాయించారు. ఇప్పటికే 247 రన్స్ చేసిన దక్షిణాఫ్రికా మంచి స్కోరు దిశగా సాగుతోంది.
రెండో టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బుమ్రా బౌలింగ్‌లో ఐదెన్ మార్‌క్రమ్ (38)కు లైఫ్ లభించింది. పరుగుల ఖాతా తెరవకముందే ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో కేఎల్ రాహుల్ పట్టుకోలేకపోయాడు. ఆపై రికెల్‌టన్ (35), మార్‌క్రమ్ జోడీ నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టీ బ్రేక్‌కు ముందు అద్భుతమైన యార్కర్‌కు మార్‌క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో సెషన్ ఆరంభంలోనే రికెల్‌టన్ను కుల్దీప్ అవుట్ చేశాడు. ఈ సమయంలో ట్రిస్టన్ స్టబ్స్ (49), తెంబా బావుమా (41) నిలకడగా ఆడి రెండో సెషన్‌లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 156/2తో నిలిచింది.
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత మరో యువ సంచలనం.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు
- Six Sixes Challenge: డబుల్ సెంచరీ కలను చెదరగొట్టిన ఒక్క షాట్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
Also Read: NTR-Neel: మళ్లీ మారిన డ్రాగన్?.. ఈసారి ఊర మాస్ కటౌట్!
లంచ్ బ్రేక్ తర్వాత జడేజా బౌలింగ్‌లో తెంబా బావుమా పెవిలియన్ చేరాడు. దాంతో మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే స్టబ్స్, వియాన్ ముల్డర్ (13)ని కుల్దీప్ అవుట్ చేశాడు. మరికాసేపట్లో మొదటి రోజు ఆట ముగుస్తుందనగా టోనీ డి జోర్జి (28)ని సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ముత్తుస్వామి, కైల్ వెరినె మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. మొదటి రోజులో దక్షిణాఫ్రికా మంచి స్కోరు చేసింది. రెండో రోజులో అయినా భారత బౌలర్లు వికెట్స్ తీయకుంటే.. భారీ స్కోర్ ఖాయం.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..