Site icon NTV Telugu

IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

Sam

Sam

Salman Ali Agha on IND vs PAK Match in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై మొన్నటివరకు కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయాయి. భారత్‌తో మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన డిమాండ్లను ఐసీసీ తిరస్కరించడంతో.. ఇక తప్పక పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌పై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్ జట్టు పూర్తిగా సిద్ధంగా సల్మాన్ అలీ అఘా చెప్పాడు. ఈసారి భారత్‌పై గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో ఆసియా కప్‌లో భారత్ చేతిలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన విషయాన్ని అంగీకరించిన సల్మాన్.. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నాడు. జట్టు సమతుల్యత, ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ తమకు బలమని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టు మంచి ప్రదర్శనలు ఇస్తోందని, అదే ఆత్మవిశ్వాసంతో భారత్‌పై విజయం సాధిస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి పాకిస్థాన్ అభిమానులను ఆనందపరచాలనే లక్ష్యంతో జట్టు ముందుకు సాగుతోందని సల్మాన్ తెలిపాడు.

Also Read: AP Assembly 2026: అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్.. ఫేషియల్ రికగ్నిషన్‌తో సభ్యుల హాజరు నమోదు!

భారత్–పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంఠభరిత పోటీగా ఉండడం తెలిసిందే. రెండు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోరు మరోసారి భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ అఘా చేసిన వ్యాఖ్యలు మ్యాచ్‌కు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి. మొత్తం 16 టీ20 మ్యాచ్‌లలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇందులో 13 సార్లు టీమిండియా, పాక్ 3 సార్లు గెలిచాయి. ప్రపంచకప్‌ హెడ్-టు-హెడ్‌లలో భారత్ ఆధిక్యంలో ఉంది. టీమిండియా 7 విజయాలు, పాకిస్తాన్ 1 విజయం సాధించాయి.

Exit mobile version