India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Historic Test Record: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ చరిత్ర సృష్టించింది. ఆదివారం (నవంబర్ 22) నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఓవర్‌నైట్ స్కోరు 486/4తో ఆట ప్రారంభించిన టీమిండియా.. తొలి సెషన్లోనే వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ గడ్డపై టెస్టు ఇన్నింగ్స్‌లో తమ అత్యధిక స్కోరును అధిగమించింది. 2009లో హామిల్టన్ వేదికగా సాధించిన 520 పరుగుల రికార్డును బద్దలు కొట్టింది. 131వ ఓవర్లోనే భారత్ ఈ ఘనత సాధించడం విశేషం.
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మరో అరుదైన ఘనతను కూడా సాధించారు. తొలి ఐదు వికెట్లకు 50కి పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశారు. రిషభ్ పంత్, నైట్‌వాచ్‌మన్ అన్షుల్ కాంబోజ్ ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించడంతో ఈ రికార్డు పూర్తయింది. కాంబోజ్ 42 బంతుల్లోనే 38 పరుగులు చేసి ఆకట్టుకోగా.. పంత్ తన తొమ్మిదో టెస్టు శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి ఐదు వికెట్లకు 50కి పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదవడం టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది రెండోసారి మాత్రమే. అంతేకాకుండా న్యూజిలాండ్ సొంతగడ్డపై ఇలాంటి ఘనత నమోదవడం ఇదే తొలిసారి.
Also Read
- Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
- Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్‌గా..
- Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
- Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
న్యూజిలాండ్ గడ్డపై భారత్ అత్యధిక టెస్టు స్కోర్లు ఇవే:
521/4 – వెల్లింగ్టన్ (2026)
520 – హామిల్టన్ (2009)
482 – ఆక్లాండ్ (1990)
భారత్ తరఫున తొలి ఐదు వికెట్లకు 50+ భాగస్వామ్యాలు నమోదైన టెస్టులు:
ఇంగ్లండ్‌పై – ముంబై (1993)
బంగ్లాదేశ్‌పై – మీర్పూర్ (2007)
ఆస్ట్రేలియాపై – అహ్మదాబాద్ (2023)
వెస్టిండీస్‌పై – ఢిల్లీ (2025)
న్యూజిలాండ్‌పై – వెల్లింగ్టన్ (2026)
తాజావార్తలు
-
India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
-
Railway Group Ticket Booking: రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో భారీ మార్పు.. కొత్త రూల్స్ ఇవే
-
Astrology: నవంబర్ 22 ఆదివారం దినఫలాలు.. ఈ పూజలు చేయండి కలిసి వస్తుంది..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!