NTV Telugu Site icon

India vs Bangladesh 3rd T20: నేడే బంగ్లాతో భారత్ చివరి మ్యాచ్‌.. ఉప్పల్లో క్లీన్స్వీప్ చేస్తారా..?

Ind Vs Ban

Ind Vs Ban

India vs Bangladesh 3rd T20: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అయింది. సూర్య కుమార్‌ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయదుందుభి మోగించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో దసర పండగ రోజు విజయాల జోరు కొనసాగించేందుకు టీమిండియా కుర్రాళ్లు సై అంటున్నారు. దూకుడు మీదున్న యువ భారత్‌ను అడ్డుకోవడం బంగ్లాదేశ్ కు అంత ఈజీ కాదు. ఇప్పటికే సిరీస్‌ గెలిచిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు తుది జట్టులో కొన్ని మార్పులు చోటు చేసే అవకాశం ఉంది.

Read Also: Ponnam Prabhakar : కేంద్ర మంత్రితో కలిసి దాండియా వీక్షించిన రాష్ట్ర మంత్రి పొన్నం

అయితే, భారత్‌ అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పవర్‌ ప్లేలోనే మూడు వికెట్లు పడిపోయినప్పటికీ టీమ్ 222 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించిందంటే బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఆ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెలరేగిపోయాడు. ఇక, యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కూడా రెచ్చిపోతే అభిమానులకు పండగే. రింకు సింగ్, హార్దిక్, రియాన్ పరాగ్‌ కూడా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. మరోవైపు బౌలింగ్‌లోనూ టీమిండియా బాగా ఆకట్టుకుంటోంది. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మయాంక్‌కు తోడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్‌ కూడా రాణిస్తున్నారు. గత మ్యాచ్‌లో ఏడుగురు భారత బౌలర్లు కనీసం ఒక వికెట్‌ తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా జరగడం అదే తొలిసారి. ఇక, చివరి టీ20 కోసం టీమ్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. రవి బిష్ణోయ్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హర్షిత్‌ రాణాలకు ఛాన్స్ దొరకనుంది.

Read Also: Astrology: అక్టోబర్ 12, శనివారం దినఫలాలు

కాగా, ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్న తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ను వరుణుడు కాస్త కలవరపెడుతున్నాడు. ఈరోజు (శనివారం) వర్షం జల్లులు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, పిచ్‌ విషయానికి వస్తే ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైంది. ఐపీఎల్‌లో ఇక్కడ సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. ముంబైతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 277 రన్స్ తో చరిత్ర సృష్టించింది. ఇక్కడ ఆడిన రెండు టీ20ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. చివరగా 2022లో ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

Read Also: Atishi: ఎట్టకేలకు సీఎం అతిషికి బంగ్లా కేటాయింపు.. ఎక్కడంటే..!

అయితే, భారత పర్యటనలో ఒక్క మ్యాచూ కూడా గెలవని బంగ్లాదేశ్ చివరి టీ20లో విజయం సాధించి మహ్మదుల్లాకు వీడ్కోలు పలకాలని చూస్తోంది. హైదరాబాద్‌ మ్యాచ్‌తో టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని మహ్మదుల్లా ముందే ప్రకటించారు. 140 టీ20లు ఆడిన అతను 2436 రన్స్ చేశాడు. గత మ్యాచ్‌లో బంగ్లా జట్టులో అతనిదే అత్యధిక స్కోరు (41)కాగా.. కానీ, టీమిండియాను ఓడించడం బంగ్లాకు కత్తిమీద సాముగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్‌ ధాటి ముందు ఆ బంగ్లా తేలిపోతోంది. బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్, ముస్తాఫిజుర్‌ మాత్రమే కాస్త ప్రభావం చూపిస్తున్నారు. స్పిన్నర్లను మన బ్యాటర్లు పట్టించుకోవడం లేదు. బ్యాటింగ్‌లోనూ కెప్టెన్‌ శాంటోతో సహా లిటన్‌ దాస్‌ తదితర ఆటగాళ్లు ఫెయిల్ అవుతున్నారు.

ఇరు జట్లు (అంచనా)..
భారత్‌: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్‌ పరాగ్, వాషింగ్టన్‌ సుందర్, వరుణ్‌ చక్రవర్తి/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, మయాంక్‌ యాదవ్‌/హర్షిత్‌ రాణా.
బంగ్లాదేశ్‌: పర్వేజ్, లిటన్‌ దాస్, శాంటో, తౌహిద్, మహ్మదుల్లా, మెహిదీ హసన్‌ మిరాజ్, మెహిదీ హసన్, రిషద్, తస్కిన్, తంజిమ్, ముస్తాఫిజుర్‌

Show comments