NTV Telugu Site icon

Ind vs Aus: మొదలైన మూడో రోజు ఆట.. ఆ నలుగురే కీలకం!

Rohit Sharma

Rohit Sharma

భారత్-ఆసీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఇవాళ అత్యంత కీలకం. మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది. బ్యాంటిగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో రోజు ఆఖరి సెషన్ లో భారత్ 10 ఓవర్లు ఆడి 36 పరుగుల చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (17 నాటౌట్), శుభ్ మన్ గిల్ (18 నాటౌట్)లు క్రీజులో నిలిచారు. మూడోరోజుల ఆట కూడా ప్రారంభమైంది.

Aslo Read : Heat Waves: మార్చిలోనే దంచి కొడుతున్న ఎండలు

బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు పండుగా చేసుకోగా.. ఉస్మాన్ ఖవాజా(180) డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ మూడో రోజు కూడా అలాగే స్పందించొచ్చు. భారీ టర్న్ అయ్యే అవకాశాలు లేవని ఇప్పటికే పిచ్ క్యూరేటర్లు హింట్ ఇచ్చిన నేపథ్యంలో నేడు ఆసీస్ బౌలింగ్ దాడిని భారత బ్యాటర్లు ఏ మేరు అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ క్రీజులో నిలిచి భారీ స్కోర్ సాధిస్తే ఈ టెస్ట్ ను భారత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.

Aslo Read : Harassment : ప్రేమ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

నేడు భారత టాపార్డర్ బ్యాటింగ్ చేయగలిగి మెరుగైన స్కోరు సాధిస్తే అప్పుడు ఆస్ట్రేలియాపై ఆధిక్యాన్ని సాధించడమే గాక ఆఖరి రోజు బంతి ఏమైనా స్పిన్ కు సహకరిస్తే కంగారులకు షాకిచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చు.. అలా జరగాలంటే నేడు భారత బ్యాటర్లు ఆడే ఆట చాలా కీలకం కానుంది. ఇప్పటికే టిమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 58 బంతుల్లో 35 పరుగులు చేసి కుహ్నెమాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్ మన్ గిల్ 86 బంతుల్లో 44 పరుగులు చేయగా.. ఛటేశ్వర్ పూజారా 18 బంతుల్లో 11 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్ లో తర్వాత వచ్చే బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ లు రాణించడం చాలా అవసరం.

Aslo Read : Viveka Case: వివేకా కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు

ఆసీస్ కొట్టిన 480 పరుగుల మార్కును దాటడం పెద్ద కష్టమేమీ కాదు. మరి భారత బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ సిరీస్ లో వికెట్ల పండుగా చేసుకున్న అశ్విన్,జడేశాలు అహ్మదాబాద్ లో వికెట్లు తీయడానికి మాత్రం నానా తంటాలుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆసీస్ స్పిన్ త్రయం నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, కుహ్నెమాన్ లకు పిచ్ పై టర్న్ ను రాబట్టడం అంత తేలిక కాకపోవచ్చు. కానీ ఎప్పుడెలా ఆడతారో తెలియన భారత క్రికెటర్లు ఎలాంటి షాకులివ్వకుంటే ఈ టెస్టులో భారత్ గట్టెక్కేందుకు అవకాశాలు ఉంటాయి.

Aslo Read : Stomach surgery: కడుపులో వోడ్కా బాటిల్ .. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స