NTV Telugu Site icon

IND Squad for WI Tour 2023: రోహిత్, కోహ్లీ, షమీ ఔట్.. వెస్టిండీస్‌తో ఆడే భారత టెస్ట్ జట్టు ఇదే!

India Squad 2023 Odi

India Squad 2023 Odi

IND Squad for WI Tour 2023: ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ముగియగా.. నెల రోజుల విరామం అనంతరం వెస్టిండీస్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 2023 జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్‌తో జట్ల మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. అయితే ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్స్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వీరికి విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఈ ఏడాదే వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లను కేవలం ఈ ఫార్మాట్‌లోనే ఆడించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ మత్సులకు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లు వరుసగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌, ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడారు. దాంతో విండీస్‌తో జరిగే టెస్టు లేదా టీ20 సిరీస్‌లకు రెస్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఆటగాళ్లతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటారు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

Also Read:
Weight Loss Tips: బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తే సరిపోదు.. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి!
రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత టెస్ట్ జట్టును అజింక్య రహానే నడిపించనున్నాడు. ఇటీవల వరుసగా విఫలమవుతున్న చటేశ్వర్ పుజారాకు మరో అవకాశం లభించనుంది. ఇక యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్. అర్ష్‌దీప్ సింగ్ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమైన ఉమేశ్ యాదవ్‌పై వేటు పడనుంది. విండీస్ పర్యటనకు సంబంధించిన జట్లను జూన్ 27న ప్రకటించే అవకాశం ఉంది.

టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు (IND Squad):
శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, చటేశ్వర్ పుజారా, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

Also Read: Hair Fall Tips: పెరుగుతో రోజూ ఇలా చేస్తే.. మీ జుట్టు రాలడం వారంలో తగ్గిపోతుంది! ట్రై చేసి చూడండి