Team India: అక్కడ టాప్‌గా నిలిస్తే.. కప్పు మాత్రం రాదు.. ఇది పక్కా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: 2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లకుండానే వెనుతిరిగిన టీమిండియా ఈ ఏడాది మాత్రం సెమీస్‌కు వెళ్లి ఆశలు రేకెత్తించింది. కానీ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘోరంగా ఓటమి చెంది టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం టీమిండియాను దెబ్బతీసిందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ప్రపంచకప్ ఫైనల్ లేదా సెమీఫైనల్లో టీమిండియా వెనుదిరిగిన ప్రతీసారి భారత ఆటగాళ్లే టాప్ స్కోరర్‌గా ఉన్నారని.. ఈ అంశం భారత జట్టుకు శాపంగా మారిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి పలు ఉదాహరణలను కూడా చూపిస్తున్నారు. 1996 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఆ ప్రపంచకప్ సెమీఫైనల్లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోయింది.
అటు 2003 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లింది. అప్పటికి సచిన్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు భంగపాటు తప్పలేదు. 2007 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం గంభీర్ సెకండ్ లీడింగ్‌లో ఉన్నాడు. దీంతో భారత్ ఖాతాలో కప్పు చేరింది. 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ సచిన్ సెకండ్ లీడింగ్ బ్యాటర్‌గా నిలవడంతో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 2014, 2016, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడని, ఈ మూడు టోర్నీల్లో భారత్ టైటిల్ అందుకోలేకపోయిందని అభిమానులు గుర్తుచేస్తున్నారు.
Also Read
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
Read Also: ICC T20 Rankings: కప్పు పోయింది.. ర్యాంకు మిగిలింది
2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన భారత్.. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడింది. 2022 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సైతం రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఇక ప్రపంచకప్‌లలోనే కాదు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాది ఇదే దారి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
Any WC Indian player leading scorer ga unte cup radhu
1996 #Sachin
2003 Sachin
2011 Sachin 2nd leading
2019 Rohit
2017CT Dhawan
2007T20 Gambhir 2nd leading
2014T20 Kohli
2016T20 Kohli
2022T20 KohliOkaridhare pressure handle chesthe migatha vallu hand istharu correct time ki
— Janasena (@RamJS6) November 10, 2022
తాజావార్తలు
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!