ICC U-19 Womens World Cup: మహిళల క్రికెట్లో మరో మెగా టోర్నమెంట్ కు సిద్ధమైంది. మలేసియా వేదికగా ఈరోజు ( జనవరి 18) అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడబోతున్నాయి. మలేసియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో కలిసి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్-ఎలో ఉండగా.. నికీ ప్రసాద్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం నాడు తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఢీ కొట్టనుంది. తెలుగు రాష్ట్రాల ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఈ టోర్నమెంట్లో ఆడుతున్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ పోటీ పడబోతుంది.
Read Also: Balakrishna: నందమూరి తారక రామారావు అనే పేరు కేవలం వ్యక్తి పేరు కాదు.. ఒక చరిత్ర
అయితే, మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ‘సూపర్ సిక్స్’కు చేరుకోనున్నాయి. ఈ 12 టీమ్స్ ను సూపర్ సిక్స్‌లో రెండు గ్రూప్‌లుగా చేస్తారు. గ్రూప్–1లో 6, గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉండనున్నాయి. ఈ సూపర్ సిక్స్’ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో ఉన్న నాలుగు టీమ్స్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. సెమీస్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ కు తలపడనున్నాయి.
Read Also: Canada: యూఎస్ ప్రజలకు సైతం డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బ తప్పదు..
ఇక, సీనియర్ టీమ్ లో చోటు దక్కించుకోవాలని చూస్తున్న ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు.. ఈసారి కూడా అదే ఆధిపత్యం కొనసాగించాలన్నారు. ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు స్ట్రాంగ్ పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అయితే, ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలిసి కట్టుగా ఆడితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం ఏం కాదు.