NTV Telugu Site icon

ChampionsTrophy2025: నేడు ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై పాక్‌తో ఐసీసీ కీలక భేటీ

Pak

Pak

ChampionsTrophy2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ కోసం టీమిండియాను తమ దేశానికి ఎలాగైనా రప్పించాలని చూసిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. పాక్‌కు వెళ్లే సమస్యే లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పడంతో.. భారత్‌ ఆడే మ్యాచ్‌లను వేరే తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన హైబ్రిడ్‌ పద్ధతికి ఒప్పుకోవాలని.. లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అల్టిమేటం జారీ చేసింది. కానీ, పాకిస్థాన్ హైబ్రిడ్‌ పద్ధతికి తాము వ్యతిరేకమని ఐసీసీకి వెల్లడించింది.

Read Also: IND vs AUS BGT: రెండో టెస్టుకు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ఔట్.. భారత్‌కు అడ్వాంటేజ్ కానుందా

కాగా, ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన అత్యవసర భేటీలో హైబ్రిడ్‌ మోడల్ లో టోర్నమెంట్ ని నిర్వహించడం తప్ప పాక్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అలా కుదరదంటే మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. హైబ్రిడ్‌ పద్ధతికి సుముఖంగా ఉంటేనే ఈ రోజు (నవంబర్ 30)పీసీబీతో సమావేశం జరిపి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తుంది. పాక్‌ ఒప్పుకుంటే భారత్‌ ఆడే మ్యాచ్‌లను మాత్రం యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తుంది.

Read Also: Russia Ukraine War: దేవుడా మాకొద్దు ఈ యుద్ధం.. దేశం వదలి పారిపోతున్న ఉక్రెయిన్ సైనికులు

భారత్‌ లేకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 నిర్వహిస్తే.. ఐసీసీకి పైసా కూడా రాదు. ఆ విషయం పాక్ కు కూడా తెలుసు. పీసీబీ చీఫ్‌ మోసిన్‌ నఖ్వీ హైబ్రిడ్‌ మోడల్ కి ఒప్పుకుంటే సరే.. లేకపోతే పాకిస్థాన్ జట్టు లేకుండా యూఏఈ లేదా మరో దేశంలో ఈ టోర్నీని నిర్వహించడానికి ఐసీసీ ప్లాన్ చేస్తోందని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. ఛాంపియన్స్‌ ట్రోఫీని మరో దేశానికి తరలిస్తే పాక్ రూ.296 కోట్లకు పైగా నష్టపోతుంది. అయితే, 2008 ముంబై దాడుల తర్వాత టీమిండియా పాక్‌లో పర్యటించలేదు.

Read Also: PM Modi: నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

అయితే, పాకిస్థాన్‌లో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 జరగాల్సిన టైంకి పరిస్థితులు మెరుగు పడతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. పరిస్థితులు మారకపోతే.. వేరే దేశాలు కూడా పాక్‌కు వెళ్లడానికి ఇష్టపడవు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ పద్ధతిపై పాకిస్థాన్ స్పందనను బట్టి.. ఐసీసీ ఇప్పుడే టోర్నమెంట్ ని మరో దేశానికి తరలిస్తే ఆశ్చర్యమేమీ లేదని ఐసీసీ బోర్డు సభ్యులు వెల్లడించారు.