Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన వరుసగా వాయిదా పడుతూనే ఉంది. నవంబర్ 29న షెడ్యూల్ విడుదల చేస్తారని అందరు అనుకున్నారు. కానీ, మరుసటి రోజుకు భేటీ వాయిదా పడింది. దీంతో ఆ రోజు జరగాల్సిన ఇంటర్ నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భేటీ కూడా జరగలేదు. ఇక, అది ఇవాళ (డిసెంబర్ 5కి) జరిగిన సమావేశం మరోసారి వాయిదా పడింది. అయితే, మరోసారి ఐసీసీ సమావేశాన్ని రెండు రోజులకు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 7న మీటింగ్ జరగనున్నట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి భేటీ కావడంతో అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సమావేశం వాయిదా పడటం గమనార్హం.
Read Also: Devendra Fadnavis: సీఎంగా ఫడ్నవిస్ తొలి సంతకం.. దేనిపై చేశారంటే..!
అయితే, పాకిస్థాన్ ఆతిథ్యంలోనే వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సింది. కానీ, పాక్‌కు వెళ్లి ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాలతో అక్కడికి టీమిండియాను పంపించమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పీసీబీని హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవాలని ఐసీసీ ఓ ఆఫర్ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు పీసీబీ ఏ విషయం చెప్పలేదు. ఇవాళ జరిగిన బ్రీఫ్ సెషన్‌లోనూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందు ఇదే ఆప్షన్‌ను మరోసారి ఐసీసీ ఉంచినట్లు సమాచారం. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మాత్రం ఆతిథ్య హక్కులను జైషా నేతృత్వంలోని ఐసీసీ మరో దేశానికి ఇచ్చేయడం ఖాయమని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుడు ఆర్థికంగా పాక్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది.