ICC Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఇక, భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీ మార్చి 9 వరకు కొనసాగుతుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది. ఇక, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇదే..
Read Also: Fake IT Jobs: ఫేక్ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి యువతను మోసం చేసిన నిందితుడు అరెస్ట్
ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్..
గ్రూప్-A: పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్
గ్రూప్-B: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్
అన్ని మ్యాచుల షెడ్యూల్..
ఫిబ్రవరి 19, పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ, పాకిస్తాన్
ఫిబ్రవరి 20, బంగ్లాదేశ్ v భారతదేశం, దుబాయ్
ఫిబ్రవరి 21, ఆఫ్ఘనిస్తాన్ v దక్షిణాఫ్రికా, కరాచీ, పాకిస్తాన్
ఫిబ్రవరి 22, ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, లాహోర్, పాకిస్తాన్
ఫిబ్రవరి 23, పాకిస్తాన్ v భారతదేశం, దుబాయ్
ఫిబ్రవరి 24, బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, రావల్పిండి, పాకిస్తాన్
ఫిబ్రవరి 25, ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా, రావల్పిండి, పాకిస్తాన్
ఫిబ్రవరి 26, ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్, లాహోర్, పాకిస్తాన్
ఫిబ్రవరి 27, పాకిస్తాన్ v బంగ్లాదేశ్, రావల్పిండి, పాకిస్తాన్
ఫిబ్రవరి 28, ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా, లాహోర్, పాకిస్తాన్
మార్చి 1, దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్, కరాచీ, పాకిస్తాన్
మార్చి 2, న్యూజిలాండ్ v ఇండియా, దుబాయ్
మార్చి 4, సెమీ-ఫైనల్ 1, దుబాయ్
మార్చి 5, సెమీ-ఫైనల్ 2, లాహోర్, పాకిస్తాన్
మార్చి 9, ఫైనల్ ( భారతదేశం అర్హత సాధించకపోతే లాహోర్ లో జరుగుతుంది.. ఇండియా అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది)
ఇక, మార్చి 10, రిజర్వ్ డేగా ఐసీసీ ప్రకటించింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే అన్ని మ్యాచ్‌లు డే-నైట్ మ్యాచ్‌లుగా ఉంటాయని తెలిపింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ మధ్యాహ్నం 2:00 గంటలకు పడనుంది.
