విజయ్ హజారే ట్రోఫీని తొలిసారి ముద్దాడిన హిమాచల్‌ప్రదేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్‌ప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన ఫైనల్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఓపెనర్ శుభమ్ అరోరా అజేయ సెంచరీ (136)తో అదరగొట్టాడు. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అమిత్ కుమార్ 74, కెప్టెన్ రిషి ధవన్ 42 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సెంచరీ (116), ఇంద్రజిత్ 80 పరుగులతో విరుచుకు పడడంతో భారీ స్కోరు సాధించింది. హిమాచల్‌ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రిషి ధవన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 315 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హిమాచల్‌ప్రదేశ్ దూకుడుగా ఆడింది.ఈ క్రమంలో 47.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. అప్పటికి వెలుతురు మందగించడంతో వీజేడీ పద్ధతిలో హిమాచల్‌ప్రదేశ్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. దీంతో హిమాచల్‌ప్రదేశ్ జట్టు శిబిరంలో అంబరాలు మిన్నంటాయి. హిమాచల్‌ప్రదేశ్‌కు ఇదే తొలి దేశవాళీ టైటిల్ కావడం గమనార్హం. 131 బంతుల్లో 136 పరుగులు చేసిన శుభమ్ అరోరాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Also Read
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!