విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్‌ప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన ఫైనల్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఓపెనర్ శుభమ్ అరోరా అజేయ సెంచరీ (136)తో అదరగొట్టాడు. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అమిత్ కుమార్ 74, కెప్టెన్ రిషి ధవన్ 42 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో…