Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Oldest ODI Centurion: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. 37 ఏళ్ల వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తా చాటుతూ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. భారత మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వయసులో సెంచరీ చేసిన బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. జింబాబ్వే మహిళల జట్టుతో ఆదివారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అద్భుత సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకుంది. అంతేకాదు ఇది ఆమెకు వన్డే కెరీర్లో ఎనిమిదో శతకం కావడం విశేషం.
భారత్ తరఫున అగ్రస్థానం:
జింబాబ్వేపై సెంచరీతో హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల వన్డే క్రికెట్లో శతకం సాధించిన నాలుగో అత్యంత పెద్ద వయస్కురాలిగా నిలిచింది. ఆమె 37 సంవత్సరాల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన బార్బ్ బీవేజ్ (39 సంవత్సరాల 48 రోజుల వయసులో) సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన జానెట్ బ్రిటిన్ (38 సంవత్సరాల 161 రోజుల వయసులో) రెండో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికాకు చెందిన డాలీన్ టెర్బ్లాంచే (37 సంవత్సరాల 289 రోజుల వయసులో) సెంచరీ చేసి మూడో స్థానంలో ఉంది. డెబోరా హాక్లీ (న్యూజిలాండ్) 37 సంవత్సరాల 91 రోజుల వయసులో సెంచరీ చేసి ఐదో స్థానంలో ఉండగా.. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 36 సంవత్సరాల 87 రోజుల వయసులో శతకం సాధించింది. భారత్ తరఫున మాత్రం అగ్రస్థానంలో హర్మన్‌ప్రీత్ ఉంది.
Also Read
- Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
- Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
- Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
- NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
అగ్రస్థానంలో రోహిత్ శర్మ:
ఇక భారత వన్డే క్రికెట్లో అత్యధిక వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో రోహిత్ శర్మ 39 సంవత్సరాల 153 రోజుల వయసులో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 38 సంవత్సరాల 327 రోజుల వయసులో రెండో స్థానంలో ఉండగా.. సునీల్ గవాస్కర్ 38 సంవత్సరాల 113 రోజుల వయసుతో మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 37 సంవత్సరాల 326 రోజుల వయసులో సెంచరీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. హర్మన్‌ప్రీత్ ఐదో స్థానంలో ఉండగా.. మొహిందర్ అమర్నాథ్ 37 సంవత్సరాల 185 రోజుల వయసులో సెంచరీ సాధించాడు.
మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వయసులో సెంచరీ చేసిన ప్లేయర్స్:
39 ఏళ్ల 48 రోజులు – బార్బ్ బెవెజ్ (న్యూజిలాండ్, 1982)
38 ఏళ్ల 161 రోజులు – జానెట్ బ్రిటిన్ (ఇంగ్లాండ్, 1997)
37 ఏళ్ల 289 రోజులు – డాలిన్ టెర్బ్లాంచె (దక్షిణాఫ్రికా, 2007)
37 ఏళ్ల 231 రోజులు – హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్, 2026)*
37 ఏళ్ల 91 రోజులు – డెబోరా హాక్లీ (న్యూజిలాండ్, 2000)
36 ఏళ్ల 87 రోజులు – సూజీ బేట్స్ (న్యూజిలాండ్, 2023)
అత్యధిక వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితా:
39 ఏళ్లు, 153 రోజులు – రోహిత్ శర్మ
38 ఏళ్లు, 327 రోజులు – సచిన్ టెండూల్కర్
38 ఏళ్లు, 113 రోజులు – సునీల్ గవాస్కర్
37 ఏళ్లు, 326 రోజులు – విరాట్ కోహ్లీ
37 ఏళ్లు, 231 రోజులు – హర్మన్‌ప్రీత్ కౌర్
37 ఏళ్లు, 185 రోజులు – మొహిందర్ అమర్నాథ్
తాజావార్తలు
-
Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర!
-
Ramayana Song: “కాపీ కొట్టేశాడా..?”.. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
-
China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
-
Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
-
US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్‌లో కీలక త్రైపాక్షిక చర్చలు!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!