MS Dhoni: ‘షోలే 2’లో ధోనీ, హార్దిక్!..వైరల్ అవుతోన్న ఫోటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకొనే చిత్రం ‘షోలే’. అమితాబ్ కెరీర్‌లో చిరకాలం గుర్తుండిపోయే సినిమా. మరి ఇలాంటి మూవీకి సీక్వెల్ రాబోతుందా? అందులో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కనిపించబోతున్నారా? అని అనుకుంటున్నారా. అదంతా ఏం లేదండీ. తాజాగా హార్దిక్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పెట్టాడు. అందులో ‘షోలే’లో కనిపించే బైక్‌పై ధోనీతో పాటు కూర్చుని కనిపిస్తున్నాడు. ఈ ఫోటోకు ‘షోలే 2 కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ధోనీని చూసి తెగ సంతోషపడుతున్నారు.
Sholay 2 coming soon 😉 pic.twitter.com/WixkPuBHg0
Also Read
- IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
— hardik pandya (@hardikpandya7) January 26, 2023
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు హార్దిక్. ఇతడి కెప్టెన్సీలోనే ఈ సిరీస్ బరిలో దిగనుంది టీమిండియా. మొదటి మ్యాచ్ ధోనీ స్వస్థలం అయిన రాంఛీలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ధోనీని సోదరుడిలా భావించే పాండ్యా.. అతడిని కలిసి సరదాగా గడిపాడు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. దీంతో ఈ పిక్చర్ ప్రస్తుతం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. కాగా, ఇటీవలే కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. అదే జోరులో టీ20 సిరీస్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీకి విశ్రాంతినిచ్చారు.
ధోనీకి ఖరీదైన బైక్‌లు, కార్లు అంటే చాలా ఇష్టం. అతని గారేజీలో ఎన్నో బైకులు, కార్లు ఉన్నాయి. వాటిలో ఈ బైక్ కూడా ఒకటిగా కనిపిస్తోంది. సైడ్ కారుతో ఉన్న ఈ బైక్ కూడా చాలా ఖరీదైనదే. మోడర్న్ బైక్ లతోపాటు వింటేజ్ బైక్‌లను సేకరించడం కూడా ధోనీకి అలవాటు. ఇక హార్దిక్ విషయానికి వస్తే 2016లో ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే అతడు టీమిండియాలోకి వచ్చాడు. ఏడాది పాటు అతని కెప్టెన్సీలోనే రాటుదేలాడు. ఆ తర్వాత 2017లో కెప్టెన్సీ కోహ్లీ చేతికి వెళ్లింది. ఇప్పుడు ఇండియాకు భవిష్యత్తు టీ20 కెప్టెన్‌గా అందరూ భావిస్తున్న సమయంలో ఈ ఫార్మాట్‌లో అప్పుడప్పుడూ వస్తున్న కెప్టెన్సీ అవకాశాలను పాండ్యా సద్వినియోగం చేసుకుంటున్నాడు.
Womens IPL: విమెన్స్ ఐపీఎల్ ఆరంభం అప్పుడే..ప్లేయర్ల వేలానికి డేట్ ఫిక్స్!
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?