Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
- భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ
- వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం
- భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Ruled Out of Afghanistan ODI Series 2026: భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్నెస్ నిరూపించుకున్న రోజు వ్యవధిలోనే.. హార్దిక్ తప్పుకోవడం విశేషం. మరోసారి గాయం అయిన కారణంగానే అతడు టోర్నీ నుంచి తప్పుకోవడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం కారణంగా హార్దిక్ సిరీస్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది.
మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ ఇద్దరూ ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశారు. బీసీసీఐ బోర్డు వైద్య బృందం ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌లో హార్దిక్ ఆడటం ఖాయమని భావించారు. అయితే మరుసటి రోజే అతడికి కొత్త గాయం తలెత్తిందట. తొడ కండరాల గాయంతో హార్దిక్ మూడు వారాలు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
వెన్ను నొప్పితో ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచులు హార్దిక్ పాండ్య ఆడని విషయం తెలిసిందే. భారత్ తరఫున ఏడాదికి పైగా విరామం తర్వాత వన్డే ఆడబోతున్న సమయంలో మళ్లీ గాయపడటం అతడి కెరీర్‌కు మరో దెబ్బగా భావిస్తున్నారు. హార్దిక్ భారత వైట్‌బాల్ జట్టులో అత్యంత కీలక ఆటగాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడడం అతడి బలం. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ జట్టును నిర్మించుకుంటున్న వేళ హార్దిక్ ఫిట్నెస్ పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అఫ్గాన్ వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. హామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు.
వన్డే సిరీస్ షెడ్యూల్:
1వ వన్డే: జూన్ 13 – ధర్మశాల
2వ వన్డే: జూన్ 17 – లక్నో
3వ వన్డే: జూన్ 20 – చెన్నై
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..