Rohit- Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తును.. తమ కెరీర్లో పెద్దగా ఏం సాధించలేని వారు నిర్ణయించడం దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. వారు ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు.. ప్రస్తుతం ఇద్దరు వన్డే క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నారు.. వన్డే ప్రపంచ కప్ 2027లో పాల్గొనడమే టార్గెట్ గా ముందుకు కొనసాగుతున్నారు. అయితే, వారు వరల్డ్ కప్ ఆడబోయే టీమ్‌లో ఉంటారా.. అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.
Read Also: Minister Ramprasad Reddy: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు..!
అయితే, ఈ అంశంపై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. స్వయంగా నేను ఆటగాడిని కాబట్టి సమాధానం చెప్పడం లేదు.. నా విషయంలోనూ ఇలాగే జరిగింది. నా సహచరుల్లో చాలా మందికి ఇలాగే జరిగింది. అయినా మేం దాని గురించి మాట్లాడం, చర్చ కూడా జరపమని తెలిపారు. విరాట్ కోహ్లీ ఇప్పటికీ అద్భుతంగా ఆడుతున్నాడు.. ఈ విషయంలో సంతోషంగా ఉన్నా.. అయితే, తమ కెరీర్లో పెద్దగా సాధించని వ్యక్తులు కూడా.. రోహిత్, విరాట్ భవిష్యత్తును నిర్ణయించడం దురదృష్టకరం అని హర్భజన్ సింగ్ విమర్శించారు.
ఇక, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎప్పటికీ గొప్ప ఆటగాళ్లే.. వారు టీం కోసం బ్యాటర్లుగా, కెప్టెన్స్ గా ఎంతో చేశారని హర్భజన్ సింగ్ అన్నారు. వాళ్లు రోజు రోజుకు తమ ఆటలో ఇంకా మెరుగవుతూ.. యువ క్రికెటర్లకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఈ విషయంలో వారి ఇద్దరికి నా అభినందనలు తెలియజేస్తున్నాని చెప్పారు. అలాగే, పిచ్‌ల గురించి కూడా అతడు (గంభీర్) మాట్లాడాడు.. గత 10, 12 ఏళ్లుగా బౌలర్లకు సహకరించే.. ముఖ్యంగా స్పిన్ పిచ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి పిచ్‌ల మీద స్పిన్నర్లు కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్నారు.. ఈ పద్ధతి పూర్తిగా మారాలి.. టెస్ట్ క్రికెట్ అంటే ఐదు రోజుల ఆట.. దాన్ని ఎందుకు రెండున్నర, 3 రోజుల్లోపే ముగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటి యువ క్రికెటర్లకు క్రీజులో ఒక రోజు మొత్తం ఉండే ఓపిక ఉండటం లేదన్నారు. టెస్ట్ క్రికెట్ ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో ఈ ఫార్మాట్ కనుమరుగైపోతుందని హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశాడు.
