Site icon NTV Telugu

IPL: ఉత్కంఠ పోరు.. గుజరాత్‌ అద్భుత విజయం..

Ipl

Ipl

ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది గుజరాత్‌ టైటాన్స్… తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి.. గుజరాత్‌ ముందు 196 పరుగుల టార్గెట్‌ పెట్టింది.. ఇక, ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో టర్న్‌ తిరిగింది.. ఒక ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు గుజరాత్‌ బ్యాట్‌మెన్స్… చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 199 పరుగులు చేసిన విజయాన్ని అందుకుంది గుజరాత్‌ టీమ్.. దీంతో.. ఈ సీజన్‌లో తమకు ఎదురైన ఏకైక ఓటమికి గుజరాత్ టైటన్స్ ప్రతీకారం తీర్చుకున్నట్టు అయ్యింది..

Read Also: CM Jagan: విశాఖ, అనకాపల్లిలో సీఎం జగన్‌ పర్యటన

ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ హైలైట్‌గా నిలిచింది 22 పరుగులు చేయాల్సిన స్థితిలో.. రషీద్ ఖాన్ 11 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. మూడు సిక్సర్లు బాది జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.. సన్‌రైజర్స్ బౌలర్లో ఉమ్రాన్ మాలిక్ (5 వికెట్లు) మినహా ఎవరూ వికెట్లు తీయలేకపోయారు. హైదరాబాద్‌ పెట్టిన భారీ టార్గెట్‌ ఛేదన కోసం బరిలోకి గుజరాత్‌కు వృద్ధి మాన్ సాహా (68) శుభారంభం చేయగా.. శుభ్‌మన్ గిల్ (22), హార్దిక్ పాండ్యా (10), డేవిడ్ మిల్లర్ (17) పరుగులు చేశారు.. రాహుల్ తెవాటియా 21 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. రషీద్ ఖాన్ కలిసి గుజరాత్‌ను విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.

Exit mobile version