దేశ రాజధాని ఢిల్లీ మెట్రో ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. మొన్నటి వరకు ఓ ఎత్తు అయితే తాజాగా జరిగిన ఘటన మరో ఎత్తు అని చెప్పొచ్చు.. చాలా మంది ప్రయాణికులు మెట్రో ప్రయాణం చాలా పొదుపుగా, సౌకర్యవంతంగా ఉంటుంది అని ఇందులో ప్రయాణిస్తుంటారు. అలాంటి ఢిల్లీ మెట్రోలో గత కొంతకాలంగా ఆకతాయిలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చిత్ర విచిత్ర చేష్టలతో తోటి ప్రయాణికులకు చిరాకు పుట్టిస్తున్నారు. కొందరు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా ఈ మధ్య వెలుగులోకి రావటంతో ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించారు. అలాంటి వెకిలీ చెష్టలు చేస్తున్న వారిపట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తునే వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ మెట్రో మరో సంఘటన తొటి ప్రయాణికుల్ని కలవరపెడుతోంది.
Also Read : TMC PARTY : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి మేము రాలేము..
ఈ సారి ఢిల్లీ మెట్రో రైల్ లో మందుబాబులు హల్‌చల్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబులు వీరంగానికి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.. దీంతో వారు తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డ్ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. మరోసారు ఢిల్లీ మెట్రో వార్తలు వైరల్‌గా మారాయి. వీళ్లేప్పుడు మారతర్రా బాబు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అయినా వీడియోను చూస్తే.. రైలు కోచ్ లోపల కింద కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు మనం చూడొచ్చు. వీడియోపై DMRCని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించాడు.
Also Read : Off The Record: ఏపీ ఉద్యోగ సంఘాలకు ఉమ్మడి లక్ష్యం లేదా? ఎందుకు వెనకబడిపోతున్నారు?
ఢిల్లీ మెట్రో ప్రయాణీకుడు ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ మెట్రో రైలు కోచ్ లోపల నేలపై కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రకమైన తాగుబోతులను మెట్రోలో ఎలా అనుమతిస్తారంటూ సదరు ప్రయాణికుడు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డీఎంఆర్‌సీ ఘటన జరిగిన కోచ్ నంబర్‌ను తెలుసుకోవాలని కోరింది. పటేల్ నగర్, రాజేంద్ర ప్యాలెస్ స్టేషన్ల మధ్య ఉన్న మెట్రో బ్లూ లైన్‌లో ఈ వీడియోను రికార్డు చేశానని ప్రయాణికుడు బదులిచ్చారు. మందుబాబులు కరోల్ బాగ్ వద్ద మెట్రో దిగారు. మీరు మీ cctv (sic)ని చెక్ చేసుకోవచ్చు అంటూ డీఎంఆర్సీకి సూచించారు.
Dear @OfficialDMRC
This type of alcoholic persons are allowed in metro ??? pic.twitter.com/7ZnjrPtDQp— anuraag dubey (@Dubey7242Dubey) May 23, 2023