టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓ యువతీ తీవ్ర బాబొద్వేగానికి లోనైంది. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడని చెప్తున్నా.. వినకుండా గుక్కపెట్టి ఏడ్చింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ని జీర్ణించుకోలేకపోతున్నామని ఒకరు, రోహిత్ లాంటి కెప్టెన్ మళ్ళీ టెస్ట్ క్రికెట్ కు దొరకడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తనని టెస్ట్ కెప్టెన్ నుంచి వైదొలగాలని ఇప్పటికే సెలక్షన్ కమిటీ చెప్పడంతోనే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్ పదవి కోల్పోకముందే గౌరవంగా తప్పుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ సన్నిహితులు చెప్తున్నారు.ఏదేమైనా రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం కోట్లాది అభిమానులకు మింగుడుపడటం లేదు. రోహిత్ లాంటి సరదా కెప్టెన్ ని మిస్ అవుతున్నామని చెబుతున్నారు. రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.