Site icon NTV Telugu

Team India ODI Captain: వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ ఔట్.. శుభ్‌మన్ గిల్కి బాధ్యతలు..?

Gill

Gill

Team India ODI Captain: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌లో గత కొన్ని సిరీస్‌లుగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడిన అతడు.. ఎట్టకేలకు టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయన టెస్టులకు వీడ్కోలు చెప్పారు. అయితే, రోహిత్ టెస్ట్‌ల కంటే వన్డే, టీ20ల్లో తనదైన ముద్రవేశాడు. టెస్ట్‌లలో నిలకడలేని ప్రదర్శన ఉన్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం అతని ఫామ్ అద్భుతంగా ఉంది. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన రోహిత్, ఇప్పుడు 2027 వన్డే వరల్డ్‌కప్‌పై దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీతో కలిసి వన్డేల్లో ఆడాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read Also: Ganja Smuggling: 4.5 కేజీల గంజాయితో పట్టుబడిన వడ్డీ వ్యాపారి.. రూ. 20 వేల నగదు, రాయల్ ఎన్ ఫీల్డ్ సీజ్..!

అయితే, భారత వన్డే కెప్టెన్సీ విషయంలో తాజాగా, ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2027 వరల్డ్‌కప్‌కు ముందు జట్టులో మరో పెద్ద మార్పు జరగబోతుందనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇక, ఇటీవల ఓ క్రీడా జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ భారత వన్డే జట్టుకు వచ్చే సిరీస్ నుంచే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని అందులో రాసుకొచ్చాడు. ఇప్పటికే టెస్ట్‌లలో టీమిండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీకి కూడా అందుకోనున్నాడా? అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కొంతమంది దీనిని సరైన నిర్ణయంగా పేర్కొంటుండగా.. మరికొందరు రోహిత్ ఉండగా, ఇలా చేయడం మంచిది కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్‌ను తండ్రి ఎందుకు చంపాడు? విచారణలో ఏం తేలిందంటే..!

ఇక, శుభ్‌మాన్ గిల్ భారత వన్డే జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ నేషనల్ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తుంది. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కు గిల్ సారథ్యం వహిస్తాడని ప్రచారం జరుగుతంది. అలాగే, టీ20లలో కూడా వైస్ కెప్టెన్సీని కూడా అతడికే అప్పగిస్తారని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. రోహిత్ నిర్ణయం తర్వాత గిల్ కెప్టెన్సీపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Exit mobile version