Ganja Smuggling: పలు ప్రాంతాల్లో నాలుగైదు భవంతులు.. లక్షల్లో వడ్డీల వ్యాపారం.. అయినా సంపాదన మీద మక్కువ తీరక గంజాయి వ్యాపారం మొదలెట్టిన వ్యక్తిని సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బందికి గంజాయితో పట్టుబడిన ఘటన వైఎంసిఏ ఎక్స్ రోడ్ నారాయణగూడలో వెలుగులోకి వచ్చింది. ఒరిస్సా నుంచి గంజాయిని తెప్పిస్తూ గుట్టు చప్పుడు కాకుండా అవసరమున్న వ్యక్తులకు తన బైకుపై తీసుకువెళ్లి ఇస్తూ లాభాలు గడిస్తున్న మల్లాపూర్ కు చెందిన చెన్న రమేష్ గౌడ్(27) అనే వ్యక్తిని డిటిఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు.
Read Also:Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్‌ను తండ్రి ఎందుకు చంపాడు? విచారణలో ఏం తేలిందంటే..!
మల్లాపూర్ నుంచి కోటి వైపు గంజాయిని రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై తీసుకవెళుతుండగా.. సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ సావిత్రి సౌజన్య, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఖలీం, కానిస్టేబుళ్లు రాజు, రవి, శిల్ప, సునీత,రమేషులు కలిసి పక్కా సమాచారంతో చెన్నా రమేష్ గౌడు వాహనాన్ని, గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో గంజాయితోపాటు రూ. 20వేల నగుదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏఈ ఎస్ శ్రీనివాసరావు, ఈఎస్ పంచాక్షరి, ఎస్సై శివకృష్ణ సిఐలు సిబ్బంది కలిసి గంజాయిని, నగదు, బైకు, నిందితుని ఎక్సైజ్ స్టేషన్ లో నారాయణ గూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
Read Also:IMD Report: రైతులకు బ్యాడ్ న్యూస్.. అప్పటి వరకు వానలు లేనట్టే..?