Dutee Chand: తన ప్రేయసిని పరిచయం చేసిన ‘గే’ క్రీడాకారిణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dutee Chand: అథ్లెటిక్స్‌లో ఒడిశాకు చెందిన ద్యుతీచంద్ ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ స్ర్పింటర్‌గా కొనసాగుతోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎన్నో ఆటుపోట్లను దాటుకుని వచ్చి స్టార్ అథ్లెట్‌గా ఎదిగింది. కొన్నేళ్ల కిందట తాను స్వలింగ సంబంధంలో ఉన్నానంటూ ఆమె భారత క్రీడారంగాన్ని ఆశ్చర్యపరిచింది. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగా చెప్పిన భారత తొలి అథ్లెట్ ద్యుతీచంద్ కావడం గమనించాల్సిన విషయం. తాజాగా ఆమె తన ప్రేయసి మోనాలీసాను పరిచయం చేసింది. ఈ మేరకు మోనాలీసాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నిన్న నిన్ను ప్రేమించా. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా, ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్యాగ్ లైన్ ఇచ్చింది.
Read Also: BSF Raising Day: బీఎస్ఎఫ్ ఇచ్చిన స్వీట్లను నిరాకరించిన పాకిస్తాన్ జవాన్లు..
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
త్వరలో ద్యుతీచంద్, మోనాలీసా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన సోదరి పెళ్లి వేడుకలో మోనాలీసాతో ద్యుతీచంద్ ఈ ఫొటో దిగినట్టు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు వస్తున్నాయి. తాను ‘గే’ అని 2019లో వెల్లడించిన ద్యుతీ చంద్ స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో ఎల్జీబీటీక్యూ జెండాతో నడుస్తూ కనిపించింది. తాను స్వలింగ సంపర్కురాలిని అని వెల్లడించినప్పుడు తన కుటుంబం ఒప్పుకోలేదని ద్యుతి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ప్రకటన తర్వాత కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ‘ఎల్జీబీటీక్యూ అథ్లెట్లు సురక్షితంగా, సుఖంగా ఉండాలి. హింస లేదా మరణం భయం లేకుండా వాళ్లు సాధారణ వ్యక్తులుగా ఉండాలి’ పేర్కొంది. కాగా స్వలింగ వివాహాలు ఇప్పటికీ భారతదేశంలో చట్టబద్దం కాదు. కానీ గతంలో సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు స్వలింగ సంబంధాలు చట్టవిరుద్ధం కాదని తీర్పునిచ్చింది.
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!